Friday, 14 August 2020

eSR Filling Doubts Clarify given by Authorities

 eSR Filling Doubts Clarify given by Authorities



e SR PART 1 Doubts Clarify :


(1) Differently-abled లో appointment of gaurdian certificate అప్ లోడ్ చేయడం తప్పనిసరి కాదు. బ్లైండ్ ఉద్యోగులు కు గార్డియన్ ఉన్నట్లయితే వారు అప్ లోడ్ చేయాలి.

(2) List of family members లో భార్య/ భర్త, పిల్లలు తో బాటు ఉద్యోగి పై ఆధారపడిన parents, brothers, sisters, widowed daugters, divorced daughters వివరాలు మాత్రమే నమోదు చేయాలి. వివాహమైన కుమార్తె డిపెండెంట్ కాదు కాబట్టి నమోదు చేయనక్కర్లేదు.

(3) హోమ్ టౌన్ వివరాలు తప్పు నమోదు చేస్తే DDO login లో సరి చేసుకోవాలి.

(4) ZPPF కు సంబంధించిన సమస్య త్వరలో సరిచేస్తారు.


e SR PART 2 Doubts Clarify :

(1) Immutable certificates లో Medical Examination, Anticidents verification certificates అందుబాటు లో వున్నా లేక సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయి వున్నా అప్ లోడ్ చేయవచ్చు. తప్పనిసరి కాదు. కాని, oath certificate, alligence to constitution certificate తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి.

(2) Mutable certificates లో PF APGLI నామినీ లను సర్వీస్ రిజిస్టరు లో నమోదు అయిన వారిని మాత్రమే పేర్కొనాలి. ఒకవేళ మార్చుకో దలచినట్లయితే ముందుగా ఆ, యా ఆఫీస్ లకు దరఖాస్తు చేసి మార్పు చేసుకోవాలి. ఆ తర్వాతే ESR లో నమోదు చేయాలి.


e SR PART-3, 4 & 5 Doubts Clarify :

(1 ) 398 స్పెషల్ టీచర్లు, అప్రెంటిస్ టీచర్లు మరియు అన్ ట్రెయిన్డ్ టీచర్ల appointment వివరాలు నమోదు చేసేలా మార్పు చేస్తారు.

(2) PRC fixation నమోదు చేసేటప్పుడు రివైజు చేసిన increments విడి విడిగా నమోదు చేయాలి. Notional increments fixation, దాని తర్వాత రివైజ్ చేసిన increments నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తారు.

(3) Step down చేయడానికి పనిష్మెంట్ లేదా రివర్షన్ వంటి రీజన్ నమోదు చేసేలా మార్పు చేస్తారు.

(4) Higher Qualifications కు సంబంధించిన ఇంక్రిమెంట్ specific order లో personal pay గా నమోదు చేయాలి. Family planning increments నమోదు చేయడానికి ప్రత్యేకంగా specific order లో చేరుస్తారు.

(5) Leaves Availed లో అబార్షన్ లీవ్, హిస్తోరెక్టమి లీవ్ నమోదు చేయడానికి మార్పు చేస్తారు.

(6) బిడ్డ చనిపోయినా Maternity leave వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా number of issues పెంచుతారు.

(7) Transfers లో నమోదు చేసేటప్పుడు గతంలో పని చేసిన స్కూల్స్ మూసివేసిన, లేదా పోస్ట్ వివరాలు నమోదు చేయడానికి అవకాశం లేకపోతే any other select చేసి అక్కడ ఆ వివరం టైప్ చేయాలి.

(8) DDO CODES లేనప్పుడు ఏవెని 11 అంకెలు టైప్ చేసి, ఇతర వివరాలు నమోదు చేయాలి. కాని 2010 తర్వాత transfer అయిన వారు మాత్రం DDO codes నమోదు చేయాలి.

(9) గతంలో SGT గా అప్పాయింట్ అయి తర్వాత DSC లో SA గా సెలెక్ట్ అయితే ముందుగా రిలీఫ్ లో రిలీవ్ అయినట్లు నమోదు చేయాలి. రిజైన్ చేసిన వారు చేయనక్కర్లేదు. తర్వాత SA గా సర్వీస్ లో చేరిన అంశాన్ని re-appointment లో నమోదు చేయాలి.

 

e SR PART 6 Doubts Clarify :

(1) గతంలో వాడుకున్న LTC వివరాలు bills కు సంబంధించి లభ్యమైన వాటిని నమోదు చేయవచ్చు.


e SR PART 7 Doubts Clarify :

(1) Interest bearing advances నుండి ఫెస్టివల్ అడ్వాన్స్ ను తొలగిస్తారు. APGLI ను కూడా వేరేగా చూపాలని కోరుతున్నాం.


e SR PART 9 Doubts Clarify :

సర్వీస్ వెరిఫికేషన్ లో

(1) PF APGLI లోన్లు March 2019 తర్వాత తీసుకున్న వాటిని తప్పనిసరి గా నమోదు చేయాలి.

(2) CPS కు సంబంధించి employee contribution మాత్రమే నమోదు చేయాలి.


E SR PART 10 Doubts Clarify :

Department tests/ Training కు సంబంధించి SR లో నమోదు చేసిన దానిని అప్ లోడ్ చేయవచ్చు.


E SR Leave Ledger Doubts Clarify :

(1) జనగణన, ఎలక్షన్లు, వేసవిలో పొందిన ట్రైనింగు లకు Earned Leave ఆ, యా తేదీల ప్రకారం నమోదు చేయవచ్చు. దేనికోసం ఇచ్చారనేది తెలిపేందుకు ఒక కాలమ్ ఏర్పాటు చేస్తారు.



Esr Complete information in pdf

Esr Online Class youtube link

0 comments:

Post a Comment

Recent Posts