Thursday, 13 August 2020

Protein Food : వెజిటేరియన్స్ స్పెషల్... ప్రోటీన్స్ కోసం ఇవి తినండి...

 Protein Food : వెజిటేరియన్స్ స్పెషల్... ప్రోటీన్స్ కోసం ఇవి తినండి...



చికెన్, మటన్, గుడ్లు వీటిలో ప్రోటీన్స్ ఫుల్లుగా ఉంటాయి. ఐతే... వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ప్రోటీన్స్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే మనకు ఎనర్జీ ఉండాలన్నీ, మనం పనులు చేసుకోవాలన్నా, కండరాలు బలంగా ఉండాలన్నా... బాడీలో ప్రోటీన్స్ లేకపోతే కష్టం. అబ్బాయిలకు రోజుకు 56 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. అమ్మాయిలకు 46 గ్రాములు కావాలి. చికెన్, మటన్ వంటివి తినేవారికి ప్రోటీన్స్ లోపం ఉండదు. కనీసం గుడ్లైనా తింటే ఈ లోపాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇవేవీ తినడం ఇష్టం లేని వారు ప్రత్యేక ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మనం బలంగా, ఎనర్జీతో ఉన్నప్పుడు ఏ అనారోగ్య సమస్యలూ రావు కాబట్టి... ప్రోటీన్స్ కోసం ఎలాంటి శాఖాహారం తీసుకోవాలో చకచకా తెలుసుకుందాం.
1. వేరుశనగ - వీటిలో ప్రోటీన్స్ బోలెడు ఉంటాయి. దాదాపు చికెన్‌తో సమానం. 10 గ్రాముల చికెన్‌లో 27 గ్రాముల ప్రోటీన్స్ వస్తాయి. అదే 100 గ్రాముల వేరుశనగలో... 26 గ్రాముల ప్రోటీన్స్ వస్తాయి. 2. బాదం - బాదం పప్పుల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. 100 గ్రాముల్లో 21.15 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అదే 100 గ్రాముల గుడ్లలో 11 గ్రాముల ప్రోటీన్సే ఉంటాయి. ఐతే... బాదంపప్పులు ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. కాబట్టి రోజుకు నాలుగు దాకా తినొచ్చు.

3. నానబెట్టిన నల్ల శనగలు - రాత్రంతా నానబెట్టి తెల్లారి తినేస్తే... ఇక ఫుల్ ఎనర్జీ. 100 గ్రాముల శనగల్లో 17 గ్రాముల ప్రోటీన్స్ దక్కుతాయి.

4. ఓట్స్ - ఈమధ్య ప్రజలు ఓట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాటితో ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి. వాటిలో ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, థయామిన్, విటమిన్ B1 ఉంటాయి. 100 గ్రాముల ఓట్స్‌లో 16.9 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.



5. పన్నీర్ - ఇది నచ్చని వారు ఇండియాలో తక్కువ మందే ఉంటారు. పన్నీరులో ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ B12, సెలెనియం, రైబోఫ్లావిన్ ఇతర పోషకాలుంటాయి. 100 గ్రాముల పన్నీరులో 14 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

6. రాజ్మా - వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. వీటిలో పొటాషియం, కాల్షియం, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. రాజ్మా సూప్ లేదా కర్రీ తింటే చాలు... చాలా ఎనర్జీ వస్తుంది. 100 గ్రాముల రాజ్మాలో 9 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి.7.క్వినోవా - వీటిని సూపర్ ఫుడ్ అంటున్నారు. అంటే ఇలాంటి ఫుడ్ తప్పక తినాలన్నమాట. ఇందులో విటమిన్సూ, మినరల్సూ ఫుల్లుగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. 100 గ్రాముల క్వినోవాలో 4.4 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

8. గ్రీక్ యోగర్ట్ - ఇదో రకమైన పెరుగు. ఇందులో ఫ్యాట్ తక్కువ ఉండి, రుచి ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా 100 గ్రాములకు 3.5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

9. బ్రకోలీ - ఇది కూడా సూపర్ ఫుడ్డే. నిండా పోషకాలు, C, K విటమిన్లు, ఫైబర్ బాగా ఉంటాయి. కాన్సర్‌ కణాల అంతు చూసే శక్తి దీనికి ఉంది. 100 గ్రాముల బ్రకోలీలో 2.8 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

0 comments:

Post a Comment

Recent Posts