స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India ) తన వినియోగదారుల కోసం నియమాలు మార్చింది.
ఒక వేళ మీరు ఎస్ బిఐ వినియోగదారులు అయితే తప్పకుండా వీటిని చదవండి. ఈ నియమాలు ఈ వారం నుంచే అమలులోకి రానున్నాయి. ఇందులో ఏటీయం నుంచి డబ్బులు తీయడం నుంచి, మినిమం బ్యాలెన్స్, ఎసెమ్మెస్ చార్జీలు వంటి అంశాల్లో కీలక మార్పులు ఉన్నాయి.
మార్పు నెంబర్ 1
ఎస్ బిఐ జూలై 1వ తేదీ నుంచి తమ ఏటియం ( ATM Withdrawal Rules ) నియమాలను మార్చింది. ఈ నియమాలను పాటించకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. SBI తన అధికారిక వెబ్ సైట్ sbi.co.inలో అందుబాటులో ఉంచిన వివరాల ప్రకారం...సేవింగ్ ఖాతా ( Saving Account Holders ) ఉన్న వాళ్లు ATM నుంచి నెలకు 8 ఉచిత లావాదేవీలు మాత్రమే చేయగలరు.
మార్పు నెంబర్ 2
SBI ఇక నుంచి వినియోగదారుల నుంచి ఎసెమ్మెస్ చార్జీలు కూడా వసూలు చేయనుంది.
మార్పు నెంబర్ 3
ఇకపై మీరు SBI ఏటీఎం నుంచి రూ.10 వేల కన్నా ఎక్కువ డబ్బు విత్ డ్రా చేస్తే మీరు తప్పుకుండా OTP నెంబర్ ఎంటర్ చేయాల్సిందే. అయితే ఇది కేవలం రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే.
మార్పు నెంబర్ 4
SBI తన వినియోగదారులకు మినిమం బ్యాలెన్స్ మెయింటేన్ చేయకపోతే ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. SBI తన 44 కోట్ల మంది వినియోగదారుల కోసం ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
0 comments:
Post a Comment