Thursday, 10 September 2020

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో 535 పోస్ట్స్

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో 535 పోస్ట్స్

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మేనేజర్‌, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.


పోస్టు పేరు: మేనేజర్‌, సీనియర్ మేనేజర్‌


మొత్తం పోస్టులు: 535


ఇందులో మేనేజర్ (రిస్క్)- 160, మేనేజర్ (క్రెడిట్) -200, మేనేజర్ (ట్రెజరీ)-30, మేనేజర్ (లా)-25, మేనేజర్ (ఆర్కిటెక్ట్‌)-2, మేనేజర్ (సివిల్‌)-8, మేనేజర్ (ఎకనమిక్‌)-10, మేనేజర్ (హెచ్ఆర్‌)-10, సీనియర్ మేనేజర్ (రిస్క్‌)-40, సీనియర్ మేనేజర్ (క్రెడిట్‌)-50 పోస్టుల చొప్పున ఉన్నాయి.

అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏండ్లలోపు వయస్సు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 37 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ. దరఖాస్తుల్లో పేర్కొన్న అర్హతల ఆధారంగా అర్హులైనవారిని ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు పిలుస్తారు.



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175


దరఖాస్తులకు చివరతేదీ: సెప్టెంబర్ 29


రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ: అక్టోబర్ లేదా నవంబర్‌లో


వెబ్‌సైట్‌: pnbindia.in

0 comments:

Post a Comment

Recent Posts