Wednesday 2 September 2020

ఫ్లాష్: ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం

 ఫ్లాష్: ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం




దిల్లీ: సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యం అంశంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఏపీ సర్కారు సుప్రీంలో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఆంగ్ల మాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25 వాయిదా వేసింది.


*Flash News..*


*ఆంగ్ల మాధ్యమంపై  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం*


*కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు.*

*తదుపరి విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా*



*_వాదనలు..._*

రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాధన్.

నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. 


నోటీస్ తో పాటు హైకోర్టు తీర్పుపై స్టే కూడా ఇవ్వాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది.

విద్యా హక్కు చట్టంలో లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన ఏమీ లేదన్న సీనియర్ న్యాయవాది విశ్వనాథన్

విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని వాదించిన విశ్వనాథన్

తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తీవ్రంగా తగ్గిపోతుందన్న న్యాయవాది విశ్వనాథన్



ప్రతివాదుల తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శంకర్నారాయణన్

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని శంకర్ నారాయణన్ వాదనలు

తెలుగు మీడియం పాఠశాల పూర్తిగా కనుమరుగు చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ప్రతివాదుల తరఫు న్యాయవాది.

హైకోర్టు తీర్పు విద్యార్థుల మాతృ భాష నేర్చుకునే హక్కులను కాలరాస్తున్న శంకర్ నారాయణన్.


*ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు.*

0 comments:

Post a Comment

Recent Posts