Sunday 6 September 2020

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) 2020 షెడ్యూల్

 అబుదాబి: డ్రీమ్‌ 11 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 షెడ్యూల్‌ బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబరు 19న తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనుంది. అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరగనుంది. సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడతాయి.



మొదటి మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మిగిలిన అన్నీ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. దుబాయ్‌లో 24 మ్యాచ్‌లు, 20 మ్యాచ్‌లు అబుదాబిలో, 12 మ్యాచ్‌లో షార్జాలో జరుగుతాయి.




0 comments:

Post a Comment

Recent Posts