Wednesday, 28 October 2020

భారత సైన్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కంబైంన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్‌)-1 నోటిఫికేషన్‌

 *🌷UPSC సీడీఎస్-1 దరఖాస్తులు షురూ🌷*Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

*🌴న్యూఢిల్లీ: భారత సైన్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కంబైంన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్‌)-1 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది.*

*🌴 ఆసక్తి, ఆర్హత కలిగిన అభర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.*

*🌷దీనిద్వారా నిర్ధిష్టంగా ఎన్నిపోస్టులను భర్తీ చేస్తున్న విషయాన్ని ప్రకటించలేదు.*

*🦋దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 28*

*🌴దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 17*

*🦋పరీక్ష తేదీ: 2021, ఫిబ్రవరి 7*

*🌷వెబ్‌సైట్‌: upsc.gov.in*


*🦋ఇండియన్ ఆర్మీ, నౌకా దళం, వాయుసేనలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతిఏడాది రెండుసార్లు సీడీఎస్ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేస్తుంది.* 

*🌴ఇందులో ఎంపికైన అభ్యర్థులను ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)-డెహ్రాడూన్‌, ఇండియన్ నావెల్ అకాడమీ (ఎన్ఐఏ)- ఎజిమల, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ- హైదరాబాద్‌, ఆఫీసర్స్ ట్రయినింగ్ అకాడమీ- చెన్నై (మద్రస్‌), ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ-చెన్నైలో నియమిస్తారు.*

*🌷అర్హతలు🌷*

*🌴ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి*

*🌴నావెల్ అకాడమీలో పోస్టులకు ఇంజినీరింగ్‌లో డిగ్రీ పాసై ఉండాలి*

*🌴ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పోస్టులకు ఇంటర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివి, డిగ్రీ ఉత్తీర్ణులై లేదా బీటెక్ లేదా బీఈ పాసై ఉండాలి.*

*🌴డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.*

*🌷ఎంపిక విధానం🌷*

*🌴 రాతపరీక్ష ద్వారా. ఇందులో అర్హత సాధించినవారిని సర్వీస్ సెక్షన్ బోర్డ్ నిర్వహించే ఇంటెలిజెన్స్ టెస్ట్‌, పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.*

*🌷పరీక్ష విధానం🌷*

*🌴ఇండియన్ మిలటరీ అకాడమీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ అకాడమీలకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌, జనరల్ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటాయి.*

*🌴ఆఫీసర్ ట్రయినింగ్ అకాడమీకి 200ల మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కుల చొప్పున ఉంటాయి.*

*🌴నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నది. ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కొత విధిస్తారు.*

*🌴దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో*

*🦋దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 28*

*🌴దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 17*

*🦋పరీక్ష తేదీ: 2021, ఫిబ్రవరి 7*


*🌷వెబ్‌సైట్‌: upsc.gov.in*

0 comments:

Post a Comment

Recent Posts