*🌷అమ్మాయిల కోసం బాలిక సమృద్ధి యోజన🌷*
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
*🌴ఈ పథకంలో ప్రతి సంవత్సరం అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తోంది.*
*🌴1997 నుంచి బాలిక యోజనా పథకం అమల్లోకి వచ్చింది. స్కూళ్లలో ఆడ పిల్లల సంఖ్యను పెంచడానికి ఈ స్కీమ్‌ను తీసుకు వచ్చారు.*
*🦋 ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టిన తర్వాత తల్లీ రూ.500 క్యాష్ గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది.*
*🌷ఈ పథకంలో ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300 అందజేస్తారు. తర్వాత 4వ తరగతి నుంచి రూ.500 వస్తాయి. ఐదో తరగతికి రూ.600, 6 నుంచి 7వ తరగతికి రూ.700, 8వ తరగతికి రూ.800, 9వ తరగతిలో రూ.1000 స్కాలర్ షిప్ అందజేస్తారు.*
*🌴ఆడ పిల్ల స్కూల్‌కు వెళ్లిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తారు.*
*🦋18 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. గ్రామాల్లో అంగన్‌వాడీ వర్కర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్ అప్లికేషన్ ఫిల్ చేసి పథకంలో చేరొచ్చు.*
*🌴 పట్టణాల్లో అయితే హెల్త్ ఫంక్షనరీస్ వద్ద స్కీమ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి.*
*🌴 దీనిని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అమలు చేస్తుంది.*
*🌴అదే పథకానికి దరఖాస్తు అప్లిక్లేషన్లు అంగన్‌వాడీ వర్కర్స్, హెల్త్ ఫంక్షనరీల దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ అప్లికేషన్లు బేసిక్ వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో, ఆరోగ్య శాఖ కార్యనిర్వాహకుల ద్వారా కూడా ఇది అమలు చేయబడుతుంది.*
*🌴1997 ఆగస్టు 15న లేదా ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లలకు బాలికా సమృద్ధి యోజన వర్తిస్తుంది. వీరు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే అందించబడతాయి.*
*🌴దరఖాస్తుతో పాటు బర్త్ సర్టిఫికెట్‌ను అందజేయాలి. అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ , ఓటరు ఐడీ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.*
*🌴వార్షిక స్కాలర్‌షిప్ కింద వచ్చే మొత్తాన్ని బాలిక కోసం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు మొదలైన వాటి కొనుగోలు చేసుకోవచ్చు.*
0 comments:
Post a Comment