Monday, 5 October 2020

పీఆర్సీ నివేదిక సమర్పణ

*పీఆర్సీ నివేదిక సమర్పణ* 

*◙ ఆరుసార్లు గడువు తర్వాత వేతన సవరణ నివేదిక సమర్పణ*

*◙ పీఆర్సీ కమిషనర్ ఆశుతోష్ మిశ్రా రాకుండానే . .

Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త. వేతన సవరణ నివేదికను 11 వ వేతన కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది.

సోమవారం సాయంత్రం నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ని కలిసి నివేదికను వేతన కమిషన్ అందించింది. ఎన్నాళ్లగానో ఉద్యోగులు ఇందుకోసం ఎదురు చూస్తున్నారు . ఆ కల ఫలించింది.

*ఆరుసార్లు గడువు తర్వాత వేతన సవరణ నివేదిక సమర్పణ*


వేతన సవరణ కమిషన్ 2018 మే 28న ఏర్పాటు. ఆరు సార్లు గడువు పొడిగించిన వేతన సవరణ కమిషన్ ఎట్టకేలకు సోమవారం తన పని పూర్తి చేసింది అక్టోబర్ 5న వేతన సవరణ నివేదికను సమర్పించింది. 

2018లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆశుతోష్ మిశ్రాను కమిషనర్ గా ప్రభుత్వం 2108 జులై 3న నియమించింది. 

ఈ సంఘానికి ఏడాది గడువు ఇస్తూ ఆ లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కోరింది. 

ఇప్పటికి వేతన సవరణ నివేదిక కొలిక్కి వచ్చింది. చివరికి ప్రభుత్వానికి నివేదిక చేరింది ఇక అమలు ఎప్పటి నుంచి ఫిట్ మెంట్ ఎంత ఇతర సౌలభ్యాలు ఏమున్నాయనేది తేలాల్సి ఉంది.



 *ఆరు సార్లు గడువు పెంపు.*

* 2018 మే 28న 11వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

* అదే ఏడాది జులై 3న అశుతోష్ మిశ్రాను వేతన కమిషన్ గా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది లోప నివేదిక సమర్పించాలని సూచించారు.

* 2013 సెప్టెంబరు 30 వరకు మొదటిసారి కాలపరిమితి పొడిగించారు మరోసారి 2018 నవంబర్ 30 వరకు గడువు పెంచారు

*2020 జనవరి 31 వరకు వేతన సవరణ కమిషన్ గడువు పెంచారు.

*మార్చి 31 వరకు మరోసారి గడువు పెంచారు.

* తిరిగి జూన్ 30 వరకు కాలపరిమితి పొడిగించారు.

* మళ్లీ సెప్టెంబరు 30 వరకు గడువు మరోసారి పొడిగించారు చివరికి అక్టోబరు 5న సమర్పించారు.

*పీఆర్సీ కమిషనర్ ఆశుతోష్ మిశ్రా రాకుండానే . . . !*


   పీఆర్సీ కమిషనర్ ఆశుతోష్ మిశ్రా రాకుండానే పీఆర్సీ నివేదికను సీనియర్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. సహజంగా పీఆర్సీ కమిషనర్ ఆధ్వర్యంలో పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. కానీ సోమవారం నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో పీఆర్సీ కమిషనర్ హాజరుకాకుండానే నివేదిక సమర్పించడం గమనార్హం.

0 comments:

Post a Comment

Recent Posts