Shcools colleges reopening in Andhra:
ఏపీ వ్యాప్తంగా నవంబర్ రెండవ తేదీ నుంచి పాఠశాలలు, కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి. అయితే.. కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో పటిష్టమైన రక్షణ చర్యలతోనే పాఠశాలలు ప్రారంభించాని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వెల్లడించారు.
నవంబర్ 2వ తేదీ నుంచి 9,10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. అయితే తరగతులు కేవలం ఒంటిపూటకే పరిమితమవుతాయి.
హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2వ తేదీ నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. నవంబర్ 23వ తేదీ నుంచి 6, 7, 8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాసులు ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.
Will the coaching centres open in November
ReplyDelete