రెండోరోజు 42 శాతం పదోతరగతి విద్యార్థులు హాజరు -మంత్రి ఆదిమూలపు సురేష్
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
రాష్ట్రంలో రెండో రోజు మంగళవారం 99.92 శాతం పాఠశాలలు తెరవగా.. 90.92 శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారని మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి విద్యార్థులు 42.33 శాతం, తొమ్మిదో తరగతి వారు 25.19 శాతం పాఠశాలలకు వచ్చినట్లు పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తున్నందున బుధవారం మరో 25.19 శాతం మంది పాఠశాలలకు వస్తారని వెల్లడించారు. నెల్లూరు జిల్లా పీసీపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయుడు, ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలంలో ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయుడు, కర్నూలు జిల్లా హాలహర్విలో ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
♦కర్నూలులో 119 మంది విద్యార్థులకు..
కర్నూలు జిల్లాలో అక్టోబరు 1 నుంచి 29 వరకు పాఠశాలకు హాజరైన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 31 మంది ఉపాధ్యాయులకు, 119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Prakasam District Todays Updates
*ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో కరోనా కలకలం..*
*నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా..*
*జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, టీచర్‍కు కరోనా పాజిటివ్..*
*త్రిపురాంతకం హైస్కూల్‍లో ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ..*
*పీసీపల్లిలోని హైస్కూల్‍లో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడికి కరోనా..*
*పెద్దగొల్లపల్లి హైస్కూల్‍లో మరో ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ.. ఒక్కసారిగా కేసులు రావడంతో ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు..*
*డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు..*
0 comments:
Post a Comment