కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం
★ ఏపీలో కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్), కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
★ సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు.
★ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని,
★ వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు.
★ వారికి ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు
★ వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు.
0 comments:
Post a Comment