Tuesday, 24 November 2020

అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు ప్రతిరోజు హాజరు కావలెను.బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా నమోదు చేయవలెను

 *🌷ఈరోజు అనగా 24.112020 వ తేదీన గౌరవ పాఠశాల విద్యా కమిషనర్ వారు  Webex వీడియో కాన్ఫరెన్స్ నందు ఇచ్చిన సూచనలు🌷*


*🌴అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు ప్రతిరోజు హాజరు కావలెను.*

 *🌷బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా నమోదు  చేయవలెను.*

*🦋జగనన్న విద్యా కానుక వారోత్సవాల షెడ్యూల్ ను అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు పరచవలెను.*

*🌴పాఠశాలకు రాని విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యా కానుక కిట్ అందిందా లేదా యూనిఫామ్ కుట్టించుకున్నారా లేదా ? షూ సైజు సరిపోయిందా లేదా ? అనే విషయాలను తెలుసుకుని రిజిస్టర్ నందు నమోదు చేసుకొనవలెను.ఏమైనా వస్తువులు అందకపోయే ఉంటే అందచేయవలెను.*

*🌴బూట్ల కొలతలు సరిపోని విద్యార్థుల విషయంలో వాటిని MRC నందు మార్చుకుని సరి అయిన బూట్లను విద్యార్థులకు అందించవలెను.*



*🌴ఒకవేళ MRC లో కూడా ఆ సైజు అందుబాటులో లేకపోతే MEO లు జిల్లాకు పంపి మార్చు కొనవలెను.*

*🌴అందరు విద్యార్థులు, విద్యా వారధి  కార్యక్రమంలో భాగంగా సప్తగిరి ఛానెల్ లో ప్రసారమవుతున్న పాఠాలను తప్పనిసరిగా వీక్షించే విధంగా సూచనలు ఇవ్వవలెను.*

*🌴అందరు DyEOs, MEOs ఈ సూచనలు అందరు ఉపాధ్యాయులకు చేరే విధంగా మరియు ఆచరించే విధంగా పర్యవేక్షణ చేయవలెను*

0 comments:

Post a Comment

Recent Posts