నేరుగా SA కేడర్ లో నియామకం పొందిన ఉపాధ్యాయులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ .
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
SA ల సర్వీస్ పాయింట్లు గణన చేయునపుడు..... *SGT కేడర్ లో నియామకం పొంది తదుపరి SA గా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు...డైరెక్ట్ SA గా నియామకం పొందిన వారికంటే....ఎక్కువ సర్వీస్ పాయింట్లు వచ్చుచున్నవనియూ , దీనివలన నేరుగా SA గా నియామకం పొందిన వారికి నష్టం వాటిల్లుతుందని , ఇది పూర్తిగా అసంబధ్ధమని భావించిన కర్నూల్ జిల్లాకు చెందిన డైరెక్ట్ SA నియామకం పొందిన ఇరువురు ఉపాధ్యాయులు ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసారు.
కాగా , బదిలీల మార్గదర్శకాలలోని సీనియారిటీ , ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లు తదితర అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం కూడా అందులో పొందుపరచబడినదని ప్రభుత్వ ప్లీడర్ గారు గౌరవ హైకోర్ట్ వారికి విన్నవించిన నేపథ్యంలో...... ఈ ఉత్తర్వులు అందిన వారం రోజులలోగా పిటిషనర్లు తమ అభ్యంతరాలను సమర్పించాలనీ... రెస్పాండెంట్లు పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని బదిలీల ప్రక్రియపై ముందుకెళ్లాలనీ... అప్పటి వరకు బదిలీల ప్రక్రియపై ఎట్టి చర్యలు తీసుకొనరాదనీ... గౌరవ హైకోర్ట్ వారు రెస్పాండెంట్లను ఆదేశించార.
0 comments:
Post a Comment