Monday, 19 April 2021

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయి?

 మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయి?

అమరావతి: మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది.


మీకు ఓ కొత్త ఫోన్ నెంబర్ కావాలనుకోండి. ఏం చేస్తారు. కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు. అలా సిమ్ కార్డు తీసుకునేటప్పుడు.. మనం కొన్ని ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇటీవల సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి. అసలు మనకు తెలియకుండానే మన పేరు మీద సిమ్‌ కార్డులు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. మనం ఎక్కడో ఇచ్చిన ఆధార్ కార్డు ను దుర్వినియోగం చేసి మన పేరుతో సిమ్ కార్డులు తీసుకోవచ్చు. అలాంటి సిమ్ కార్డులతో ఏదైనా చట్ట వ్యతిరేకమైన పని చేస్తే అప్పుడు మనం ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి వస్తుంది.


మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి.. అసలు మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో.. ఎలా తెలుసుకోవచ్చా.. అలాంటి సౌకర్యం ఉందా.. ఉంది..


అవును.. మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. టెలికామ్ శాఖ ఈ వెసులుబాటు కల్పిస్తూ ఓ వెబ్ సైట్‌ను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం రూపొందించింది. సోమవారమే ప్రారంభించింది.


 http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి.


అలా వచ్చిన వివరాలు పరిశీలించుకుని.. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని మనం తొలగించుకోవచ్చు.. అలాంటి నెంబర్లను సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే టెలికం శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది. నిబంధనల ప్రకారం 'ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుందట. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని ఇటీవల టెలికాం శాఖ గుర్తించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ రవి ఒక ప్రకటనలో తెలిపారు.



ఈ వెబ్ సైట్ కారణంగా సైబర్ నేరాలు కాస్త తగ్గే అవకాశం ఉంది. అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్‌ పడుతుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ సౌకర్యం ముందుగా ఏపీ, తెలంగాణ టెలికం సర్కిళ్లలోనే వచ్చింది. ఇక్కడి ఫలితాలు చూసి... త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి తెస్తారట.


 http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.*

0 comments:

Post a Comment

Recent Posts