Sunday, 23 May 2021

సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై జూన్ 1వ తేదీలోగా నిర్ణయం

 సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై జూన్ 1వ తేదీలోగా నిర్ణయం 


 *♦సీబీఎస్ఈ క్లాస్ 12పరీక్షలపై కేంద్రం వెల్లడి* 

*♦25లోగా రాష్ట్రాలు సూచనలు ఇవ్వాలి*

*♦పరీక్షల నిర్వహణకే మెజారిటీ రాష్ట్రాల మొగ్గు*

 *♦విద్యార్థులకు టీకాలువేశాకే పరీక్షలన్న ఢిల్లీ* 

 *♦రెండు ప్రతిపాదనలు చేసిన సీబీఎస్ఈ*

 *🌻న్యూఢిల్లీ:* కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో... సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై జూన్ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల్లో కొంతవరకు ఏకాభిప్రాయం వ్యక్త మైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రా యాల్ నిషాంక్ తెలిపారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, సూచనలను సమగ్రంగా మే 25 లోగా తమకు పంపించాలని కోరారు. క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్ర రక్ష ణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశాయి. పరీక్షలు నిర్వహించకూడదనే ప్రతిపా దనను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర. పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయాలని ఢిల్లీ, కేరళ సూచించాయి. మరోవైపు, జూలై 15 నుంచి ఆగస్ట్ 26 మధ్య పరీక్షలు నిర్వ హించి, సెప్టెంబర్ లో ఫలితాలను విడుదల చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకే షన్ (సీబీఎస్ఈ) సూచించింది. పరీక్షల నిర్వహ ణకు సంబంధించి సీబీఎఎస్ఈ రెండు ప్రతిపా దనలు చేసినట్లు సంబంధిత వర్గాలు

వెల్లడించాయి. అవి. 1) కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మొత్తం 19 మేజర్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. మైనర్ సబ్జెక్టుల ఫలితాలను మేజర్ సబ్జెక్టుల్లో ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. మూడునెలల్లో మొత్తం ప్రక్రియను ముగించాలి. తొలినెలలో ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీ, రెండోనెలలో పరీక్షలు, మూడోనెలలో ఫలితాలు వెల్లడించాలి.


 2) 3 గంటలు కాకుండా, గంటన్నర పాటే, వారి పాఠశాలలోనే పరీక్షలు జరపాలి. పరిస్థితిని బట్టి రెండుసార్లు పరీక్షలను నిర్వహించవచ్చు. జూలై 15 నుంచి ఆగస్ట్ 1 మధ్య ఫస్ట్ ఫేజ్, ఆగస్ట్ 8-26 మధ్య సెకండ్ ఫేజ్ పరీక్షలను నిర్వహిం చవచ్చు. కరోనా కారణంగా ఏ విద్యార్థి అయినాపరీక్ష రాయలేనట్లయితే.. ఆ విద్యార్థికి మరో అవకాశం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్, షార్ట్ ఆన్సర్ తరహాలో ప్రశ్నపత్రం ఉండాలి. ఒక లాంగ్వేజ్, మూడు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం


సీబీఎస్ఈ మొదటి ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు, రెండో ప్రతిపాదనను మెజారిటీ రాష్ట్రాలు సమర్ధించినట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసింది. ఏప్రిల్-మేలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. సమావేశం ఫలవంతంగా జరిగిందని, రాష్ట్రాల నుంచి విలువైన సూచ నలు రమే పోబ్రియాల్ పేర్కొన్నారు. 'సలహాలు, సూచనలతో సమగ్ర నివేదికను మే 25 లోపు పంపించాలని రాష్ట్రా లను కోరాం. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని, అనిశ్చితికి తెరవేస్తాం' వెల్లడించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, సంజయ్ ధాత్రే, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. 'క్యాన్సిల్బోర్డ్గ్జామ్స్' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్లో ఉంది. 


పరీ క్షల నిర్వహణకు తాము వ్యతిరేకమని, టీకాలు వేయకుండా విద్యార్థులను పరీక్షలు రాయ మనడం పెద్ద పొరపాటవుతుందని ఢిల్లీ ఉపము ఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది క్లాస్ 12 విద్యా ర్ధులున్నారని, వారిలో 90% 17 ఏళ్లు పైబడినవా రేనని ఆయన వివరించారు. వారికి కోవిడ్ టీకా ఇవ్వడానికి వీలవుతుందేమో నిపుణులతో చర్చించాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సుముఖమే కానీ, కరోనా పరిస్థితులు సద్దుమ ణిగిన తరువాత పరీక్షలు జరిపితే మంచిదని భావిస్తున్నట్లు తమిళనాడు పేర్కొంది. ఈ పరీ క్షలు విద్యార్థుల కెరీర్కు ఎంతో ముఖ్యమంది.

0 comments:

Post a Comment

Recent Posts