Friday 28 May 2021

2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదు::RBI

 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదు::RBI


2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గురువారం తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కూడా కొత్తగా నోట్లు తీసుకు రాలేదని తెలిపింది. ఆర్బీఐ మే 26వ తేదీన వార్షిక నివేదిక విడుదల చేసింది. FY21లో మొత్తంగా పేపర్ క్యాష్ సరఫరా 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 2,23,875 లక్షల కరెన్సీ నోట్లు సరఫరా అయ్యాయి.



ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వ్యాల్యూ కలిగిన డినామినేషన్ రూ.500, రూ.2000 నోట్లు. కరెన్సీ సరఫరాలో ఈ రెండింటి వ్యాల్యూ 85.7 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అధిక విలువ కలిగిన ఈ కరెన్సీ వ్యాల్యూ వాటా ఎక్కువ.

అంతకుముందు ఎడాది 83.4 శాతంగా ఉంది. వ్యాల్యూమ్ పరంగా రూ.500 డినామినేషన్ కలిగిన నోట్ల వాటా 31.1 శాతం.


రూ.2000 నోట్లు ప్రింట్ చేయలేదని గత ఏడాది వార్షిక నివేదికలోను ఆర్బీఐ పేర్కొంది. 2018 నుండి వ్యవస్థలో రూ.2000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లు, 2020 చివరి నాటికి 27,398 లక్షల నోట్లకు తగ్గాయి.


0 comments:

Post a Comment

Recent Posts