*🌺తెలుగుతో సహా 8 భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుకి అనుమతిచ్చిన AICTE🌺*
*📚✍తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్!✍📚*
*♦ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్*
*♦ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు*
*♦8 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు*
*♦తాజా నిర్ణయంపై తెలుగు విద్యార్థుల హర్షం*
*🌺ఎడ్యుకేషన్ రెగ్యులేటర్, ఆల్ ఇండియా కౌంసిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎనిమిది భారతీయ భాషల్లో కోర్సులకు అనుమతి ఇచ్చింది.*
*🌺వీటిలో తెలుగు కూడా ఇప్పుడు ఉంది.*
*🌺2021-22 అకడమిక్ సెషన్ నుండి ఈ కోర్సులు మొదలవుతాయి.*
*🌺మరి ఏ భాషలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూస్తే… హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ్, గుజరాతి, కన్నడ మరియు మలయాళం భాషలో కోర్సులు ఇప్పుడు ఉంటాయి.*
*🌺అయితే దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే… మోదీ ప్రభుత్వం మాతృభాష లో విద్యను అభ్యసించాలి అన్న నిర్ణయం మూలాన్ని ఈ ఫెసిలిటీ వచ్చింది.*
*🌺నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండర్ లో దీన్ని తీసుకు రావడం జరిగింది.*
*🌺నవంబర్ 2020 లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రపోసల్ ని చెప్పింది*
*🌺ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ని మాతృభాషలో కూడా తీసుకు రావాలని అప్పుడు అనడం జరిగింది.*
*🌺ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా గ్రామాల్లో వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి బాగా సహాయపడుతుంది.*
*🌺 అయితే దీన్ని తీసుకు రావడానికి మరొక ముఖ్య ఉద్దేశం ఉంది. అది ఏంటంటే..? మాతృభాష లో విద్యార్థులకు బోధించడం వల్ల వరల్డ్ ఫండమెంటల్స్ మరింత బాగా అర్థం చేసుకుంటారని నిజంగా ఇది బాగా ఉపయోగ పడుతుంది.*
*🌺అయితే త్వరలో ఇంజనీరింగ్ కోర్సుని మరో 11 భాషలలోకి కూడా తీసుకు రానున్నారు*
*🌻ఆంధ్రప్రభ న్యూస్:* తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఉవ్విళూరుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తీపి కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం (2021-2022 నుంచే తెలుగుతో సహా మరో ఏడు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించుకోడానికి అవకాశం కల్పిస్తూ ఏఐసీటీఈ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళీ, తమిళ భాషల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాధ్యమాల్లో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించుకునేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల్లో అరవై శాతానికి పైగా గిరిజన, వెనుకబడిన మారుమూల ప్రాంతాల కు చెందిన వారేనని,ఇందులో మెజార్టీ విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు తెలుగు, ఆయా ప్రాంతీయ భాషల్లో చదివి ఇంజనీరింగ్ లో చేరుతున్నారని కేంద్ర ప్రభుత్వం తీసిన లెక్కల్లో బయట పడింది. ఇంటర్ వరకు ఆయా మాధ్యమాలలో చదివి ఇంజనీరింగ్ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చేరేసరికి ఆశించిన స్థాయిలో రాణించ లేకపోతున్నారని గుర్తించింది. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి 500కు పైగా కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయని, ఏఐసీటీ ఈ తాజా నిర్ణయంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను ఈ సంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించినందున ప్రథమ సంవత్సరం పాఠ్య పుస్తకాలను కళాశాలలు తెరిచే నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు ఏఐసీటీ ఈ చెబుతోంది. ఇంగ్లీష్ నుంచి ఆయా ప్రాంతీయ భాషల్లోకి సిలబస్ ను అనువదించి పాఠ్యపుస్తకాల ముద్రణను ప్రారంభించామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
0 comments:
Post a Comment