Thursday, 20 May 2021

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుంది

 జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నేడు  తుది తీర్పు వెల్లడించనుంది


అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించనుంది. ఎన్నికలకు 4వారాల మందు నోటిఫికేషన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొంటూ టీడీపీ నేతలు వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి... ఏప్రిల్‌ 1న ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా జరిగే తదుపరి చర్యలను నిలుపుదలచేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్‌ తేదీకి 4వారాల ముందు కోడ్‌ అమలు చేసేలా రీ-నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఎస్‌ఈసీకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేయగా...


ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూనే... ఓట్ల లెక్కింపు, ఫలితాలపై ప్రకటన చేయవద్దని స్పష్టంచేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ కోసం సింగిల్‌ జడ్జికి అప్పగించింది. మరోవైపు గతేడాది నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటినుంచి ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ నేత పాతూరి నాగభూషణం వ్యాజ్యాలు దాఖలు చేశారు. అన్ని వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి ఈ నెల 4న తీర్పును రిజర్వ్‌ చేశారు.


0 comments:

Post a Comment

Recent Posts