CoviSelf: ఇంటివద్దే స్వయంగా కొవిడ్ పరీక్ష! యాంటీజెన్ టెస్ట్ కిట్‌కు ఆమోదించిన ఐసీఎంఆర్
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతితో యావత్ దేశం వణికిపోతున్న వేళ.. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లోనే కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. లక్షణాలున్న వ్యక్తి ఇంటి వద్దే స్వయంగా కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ‘CoviSelf’ పేరుతో మైల్యాబ్ రూపొందించిన యాంటీజెన్ టెస్ట్ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి(ICMR) ఆమోదం తెలిపింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ కిట్ విస్తృతంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.
పుణెకు చెందిన మైల్యాబ్ రూపొందించిన ఈ కిట్‌లో కొవిడ్ నిర్ధారణ పరీక్షకు కావాల్సిన ఓ ద్రవపదార్థంతో కూడిన ట్యూబ్, శాంపిల్ సేకరణకు స్వాబ్, టెస్ట్ కార్డుతో పాటు పరీక్ష పూర్తైన తర్వాత వీటిని సురక్షిత విధానంలో పడేసేందుకు ప్రత్యేక కవరు ఉంటాయి. పరీక్ష ప్రారంభించే ముందు మైల్యాబ్ రూపొందించిన కొవిసెల్ఫ్ (CoviSelf) యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.
* Prefilled Extraction Tube: కొవిడ్ నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే ద్రవం ఈ ట్యూబ్‌లో ఉంటుంది. దీనిని మూడు, నాలుగు సార్లు కదిలించి ద్రవాన్ని ట్యూబ్ కింద భాగంలోకి వచ్చేట్లు చూసుకోవాలి.
* Sterile Nasal Swab: ఈ స్వాబ్‌ను నాసికా రంధ్రాల్లో ఉంచి ఐదు సార్లు తిప్పాలి. ఇలా రెండు నాసికా రంధ్రాల్లో అలా చేయడం వల్ల కచ్చితమైన శాంపిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ద్రవపదార్థం ఉన్న ట్యూబులో స్వాబ్‌ను ముంచి, శ్వాబ్‌పై భాగాన్ని తుంచివేయాలి. అనంతరం ట్యూబ్ మూతను కప్పివేయాలి.
* Test Card: ఇలా శాంపిల్‌ను ముంచిన ద్రవాన్ని టెస్ట్ కార్డుపై రెండు చుక్కలు వేయాలి. ఇక అంతే.. ఫలితం కోసం 15 నిమిషాల పాటు వేచి చూడండి.
* MyLab CoviSelf App: ఇప్పటికే వివరాలు నమోదు చేసుకున్న ఈ యాప్ నుంచి పదిహేను నిమిషాల్లోపే ఓ శబ్దం వస్తుంది. టెస్ట్ కార్డ్ (Test Card)పైన కేవలం C-క్వాలిటీ కంట్రోల్ లైన్ వద్ద మాత్రమే చార కనిపిస్తే కొవిడ్ నెగిటివ్‌గా నిర్ధారించుకోవచ్చు. ఇక క్వాలిటీ కంట్రోల్ లైన్-C తో పాటు టెస్ట్ లైన్- T వద్ద రెండు చారలు కనిపించినట్లయితే కొవిడ్ పాజిటివ్‌గా పరిగణిస్తారు.
కృత్రమ మేధ సహాయంతో యాప్‌లో 5 నుంచి 7 నిమిషాల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఈ ఫలితం కోసం గరిష్ఠంగా 15 నిమిషాలు మాత్రమే వేచిచూడాలి.
20 నిమిషాల తర్వాత వచ్చే ఫలితాలన్ని పరిగణలోకి తీసుకోకూడదని కొవిడ్ కిట్ రూపకర్తలు వెల్లడించారు. ఇలా వచ్చిన కొవిడ్ ఫలితాన్ని యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే కొవిడ్ నిర్ధారణ ఫలితం ఐసీఎంఆర్‌కు అనుసంధానమైన సర్వర్లోనూ నిక్షిప్తమవుతుంది.
* Bio Hazard Bag: ఇలా కొవిడ్ పరీక్ష పూర్తైన తర్వాత పరీక్షకు వినియోగించిన వాటన్నింటిని ప్రత్యేకమైన కవర్లో (Bio Hazard Bag) వేసి చెత్త డబ్బాలో వేయాలి.
* కొవిడ్ లక్షణాలు ఉండి.. ఈ యాంటీజెన్ టెస్టులో నెగటివ్ ఫలితం వస్తే మాత్రం వెంటనే RTPCR పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
How to Use CoviSelf Antigen Test watch This Vedio
ఈ యాంటీజెన్ కిట్ ధర దాదాపు రూ.250 ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కిట్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ డైరెక్టర్ సుజిత్ జైన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాప్‌లతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఈ కిట్ అందుబాటులో ఉంటుందని మైల్యాబ్ సంస్థ పేర్కొన్నారు. ఇలా ఇంటిలో స్వయంగా కొవిడ్ నిర్ధారణ చేసుకునే కిట్‌లు అమెరికాలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో మాత్రం ఇదే తొలి యాంటీజెన్ కిట్ కావడం విశేషం.
0 comments:
Post a Comment