Job Notification: నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు Delhi subordinate services selection board.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Job Notification: DSSSB huge vacancies
మొత్తం ఖాళీలు : 7236
1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ :6258
సబ్జెక్టులు : హిందీ, నాచురల్ సైన్స్, మ్యాథ్స్ ,సోషల్ సైన్సెస్ , బెంగాలీ.
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో బిఏ, బ్యాచులర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు సీటెట్ లో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : 32 సంవత్సరాలకు మించకూడదు.
2. అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ) :628
అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తోపాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో డిప్లమో, సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాటకూడదు.
3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 278
అర్హత: మెట్రిక్యులేషన్, సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత. ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు :18 -27 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. కౌన్సిలర్ : 50
అర్హత : సైకాలజీ ,అప్లైడ్ సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్ సైకాలజీలో పీజీ డిప్లమో ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
వయసు : 30 ఏళ్లు దాటకూడదు.
5. పట్వారీ :10
అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ,కంప్యూటర్ ప్రొఫిషీయన్సి తో పాటు ఉర్దూ, హిందీ లో పని అనుభవం ఉండాలి.
వయసు : 21 – 27 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 25/5/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 24/6/2021
0 comments:
Post a Comment