మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకున్నారా? లేదంటే కలిగే 10 నష్టాలివే!
1. పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే.. మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు.
2. చెల్లుబాటు కాని పాన్ కార్డును ఉపయోగించడం శిక్షార్హం. ఇంకా రూ.1000 జరిమానా చెల్లించుకోవాలి.
3. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టాలంటే కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డు చెల్లకపోతే మీరు ఎంఎఫ్‌లో డబ్బులు పెట్టలేరు.
4. మీరు బ్యాంక్‌లో అకౌంట్ తెరవాలన్నా లేదా రూ.50 వేలకు పైన డబ్బులు డిపాజిల్/విత్‌డ్రాకు కచ్చితంగా పాన్ అవసరం అవుతుంది. పాన్ కార్డు లేకపోతే ఇబ్బందులు పడాలి.
5. మీరు రూ.5 లక్షలకు పైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తే.. పాన్ వివరాలు అందించాల్సిందే. లేదంటే కొనడం కుదరదు.
6. అలాగే వాహన కొనుగోలుకు కూడా పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు పైన వెహికల్ లేదా కారు కొనుగోలుకు పాన్ కచ్చితంగా ఇవ్వాల్సిందే.
7. పాన్ ఆధార్ లింక్ కాకపోతే డబుల్ టీడీఎస్ పడుతుంది. అంటే 20 శాతం టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది.
8. పాన్ కార్డు చెల్లుబాటు కాకపోతే.. అప్పుడు మీరు ఎక్కడైనా కేవైసీ కోసం పాన్ ఇచ్చి ఉంటే.. అది చెల్లదు
9. స్టాక్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడం కుదరదు. డీమ్యాట్ ఖాతాకు పాన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే.
10. ఐటీఆర్ దాఖలు చేయాలన్నా కచ్చితంగా పాన్ కార్డు అవసరం అవుతుంది.
0 comments:
Post a Comment