Monday, 7 June 2021

ఇంటర్మీడియట్ క్లాస్ 12 బోర్డు పరీక్ష 2021 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన 12 రాష్ట్రాలు

 ప్రధాని నరేంద్ర మోడీ, దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యా మంత్రులు, విద్యా కార్యదర్శులు మధ్య ఉన్నత స్థాయి సమావేశం తరువాత జూన్ 1 న 12 వ తరగతి సిబిఎస్‌ఈ బోర్డు పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిబిఎస్‌ఇ, సిఐఎస్‌సిఇ, మరియు వివిధ రాష్ట్ర బోర్డులకు సంబంధించి ప్రధాని మోడీ నిర్ణయం తరువాత 2021 రాష్ట్ర బోర్డులు పరీక్షలను రద్దు చేయడం మొదలుపెట్టాయి.


ఏ రాష్ట్రాలు రద్దు చేస్తాయి అంటే


1. గుజరాత్


గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (జిఎస్‌హెచ్‌ఎస్‌ఇబి) నిర్వహించే గుజరాత్ క్లాస్ 12 స్టేట్ బోర్డ్ పరీక్షలను రద్దు చేసారు.

2. మధ్యప్రదేశ్


ఎంపి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12 వ తరగతి ఎంపి బోర్డు పరీక్షలను నిర్వహించదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ప్రకటించారు.


3. ఉత్తరాఖండ్


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను సమప్రధించిన తర్వాత వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉత్తరాఖండ్ ఇంటర్మీడియట్ క్లాస్ 12 బోర్డు పరీక్ష 2021 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


4. ఉత్తర ప్రదేశ్


యుపి బోర్డు క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షలను 2021 ఉత్తరప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గురువారం రద్దు చేసినట్లు యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్లో ప్రకటించారు.


5. రాజస్థాన్


ఆర్‌బిఎస్‌ఇ 10, 10 వ తరగతి పరీక్షలు 2021 రద్దు చేసినట్లు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.


6. హర్యానా


హర్యానా స్కూల్ 12 బోర్డ్ పరీక్షలను 2021 రద్దు చేయాలని హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్ణయించినట్లు హర్యానా విద్యా మంత్రి కన్వర్ పాల్ ప్రకటించారు.


7. గోవా


గోవా బోర్డ్ ఆఫ్ సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2021 క్లాస్ 12 పరీక్షలను రద్దు చేసింది. బోర్డు అందించిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు తరువాత పరీక్షకు హాజరుకావచ్చని గోవా బోర్డు సర్క్యులర్ పేర్కొంది.


8. కర్ణాటక


కర్ణాటక II పియు పరీక్షలను రాష్ట్రంలో రద్దు చేసినట్లు కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి ఎస్ సురేష్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు.


9. మహారాష్ట్ర


10, 12 తరగతులకు మహారాష్ట్ర రాష్ట్ర బోర్డు పరీక్షలు 2021 రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వాడేటివార్ ప్రకటించారు.


11. ఒడిశా


కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిహెచ్‌ఎస్‌ఇ) నిర్వహించే ఒడిశా క్లాస్ 12 బోర్డు పరీక్షలను 2021 రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.


12. తెలంగాణ


2021 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి సంవత్సరంలో వారి స్కోర్‌ల ఆధారంగా రెండవ సంవత్సరం విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


8 comments:

Recent Posts