సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
కరోనా వైరస్ విజృంభణతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment