2008 డిఎస్‌సి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందించారు. బుధవారం సిఎంను కలిసిన 2008 డిఎస్‌సి అభ్యర్థులు తమ గోడు వినిపించుకోగా ముఖ్యమంత్రి మినిమం స్కేల్ ఇస్తూ ఒప్పంద ప్రాతిపదికన తీసుకునేందుకు అంగీకరించారు. దీని వలన రాష్ట్రంలో 2193 మందికి, విజయనగరం జిల్లాలో 215 మందికి లబ్ది కలగనుంది. 2008 డిఎస్‌సిలో డిఎడ్ అభ్యర్థులు పోస్టులను బిఇడి సెలెక్టెడ్ అభ్యర్థులతో భర్తీ చేశారు. డిఎడ్ ద్వారా ఎంపికైన వారు బిఇడి అభ్యర్థులతో ఎస్‌జిటి పోస్టులు భర్తీ చేయడం వలన తమకు అన్యాయం జరిగుతుందని సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు 30 శాతం సీట్లు డిఎడ్ వారికి కేటాయించాలని తీర్పు ఇచ్చింది.
దీంతో 30శాతం కోటలో ఎంపికైన బిఇడి క్వాలిఫైడ్ అభ్యర్థులు పోస్టులకు ఎంపికై కూడా ఖాళీగా ఉండిపోయారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాపితంగా 2913 మంది అభ్యర్థులు ఉండిపోయారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని వారు ఆందోళన చేస్తూనే రాష్ట్రస్థాయి అధికారులను కలిసి విన్నవించుకుంటున్నారు. వారికి న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి.
ఎట్టకేలకు వీరికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు అంగీకరించింది. జిల్లాలో 215 మంది అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఒప్పంద పద్దతిలో చేరేందుకు అభ్యర్థులు నుంచి విల్లింగ్ కోరగా వారిలో 120మంది మాత్రమే అంగీకార పత్రాలు ఇచ్చారు. సుమారుగా 14 ఏళ్లగా భర్తీ చేయకపోవడంతో ఉపాధి కోసం వేర్వేరు ప్రైవేటు ఉద్యోగాల్లోనూ, కొంతమంది ఇతర ఉద్యోగాల్లో చేరటం వల్ల విల్లింగ్ ఇవ్వలేక పోయారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారు అంగీకారం లేఖలు ఇస్తారో లేదో చూడాలి.
0 comments:
Post a Comment