Thursday 24 June 2021

టీకా తీసుకున్న తర్వాత ఆ 30 నిమిషాలే ఎంతో కీలకం

 దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. అయితే ఇక కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైరస్ తో పోరాటంలో టీకా కీలకం గా మారిపోయింది. ఇక ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి అందరిలో యాంటీబాడీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వైరస్ ఎన్ని విధాలుగా రూపాంతరం చెందినప్పటికీ ప్రతి ఒక్కరూ వైరస్ తో పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే వ్యాక్సిన్ అందించేందుకు నిర్ణయించింది.


ఇకపోతే ఇప్పటికికూడా టీకా విషయంలో ఎంతో మందిలో అనుమానాలు అపోహలు ఉన్నాయి.

ఇక ప్రజల్లో నెలకొన్న అనుమానాలు అన్నింటిని తొలగిస్తూ అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కలుగుతాయి అని ఎంతో మంది అనుమాన పడుతున్నారు . 



ఇక తాజాగా ఈ విషయంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. క్లారిటీ ఇచ్చింది. టీకా తీసుకున్న తర్వాత తొలి 30 నిమిషాలే ఎంతో కీలకం అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తొలి 30 నిమిషాలలో ఏదైనా ప్రమాదకర లేదా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే ఆ సమయంలోనే కనిపిస్తాయి అంటూ వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. అందుకే టీకా తీసుకున్న అరగంట పాటు వైద్యుల అబ్జర్వేషన్ లో ఉంచుతున్నాము అంటూ కేంద్రం స్పష్టం చేసింది కానీ ఎంతో మంది అనవసరమైన వందతులు,పుకార్లు ప్రచారం చేస్తున్నారని.. తద్వారా గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలు వ్యాక్సిన్ కు దూరం అవుతున్నారు అంటూ కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒక వ్యాక్సిన్ వయల్ తెరిచిన తర్వాత కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే అన్ని డోసులను ఇచ్చేయాలని అందుకే ఇంటింటికీ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించామని కేంద్రం స్పష్టం చేసింది.

0 comments:

Post a Comment

Recent Posts