Wednesday 16 June 2021

55% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలి సీఎం జగన్‌కు ఏపీఎన్జీవో సంఘం విజ్ఞప్తి

 *🌷55% ఫిట్‌మెంట్‌తో**పీఆర్‌సీ ఇవ్వాలి🌷*

*🌴సీఎం జగన్‌కు ఏపీఎన్జీవో సంఘం విజ్ఞప్తి*


*🌷అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్‌సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జులై 1 నుంచి ఇవ్వాలని కోరగా.. సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే వేతన సవరణను అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.*


*🌴 సీపీఎస్‌పై మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలిస్తామని, ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు.*



*🦋 బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందించినట్లు చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.*


*🌴ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరినట్లు వివరించారు. ‘2008 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల తరహాలోనే 1998 డీఎస్సీ అభ్యర్థులకు అవకాశమివ్వాలి.*


*🦋 నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచాలి’ అని కోరినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారని, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు.*

0 comments:

Post a Comment

Recent Posts