Saturday, 26 June 2021

9, 10 తరగతులకు దూరదర్శన్ ద్వారా బోధన

9, 10 తరగతులకు దూరదర్శన్ ద్వారా బోధన

 *♦July 1 నుంచి ప్రారంభం*

 *♦ఎసిఇఆర్టీ  డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి*

 *♦ఉపాధ్యాయ సంఘాలతో చర్చ*


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు జులై 1 నుంచి దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేయాలని ఎస్ఐఆర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో అకడమిక్ కేలండర్పై శనివారం ఉదయం 10.30 గంటలకు గుర్తింపు పొందని సంఘాలతో మధ్యాహ్నం 3:30 గంటలకు విడివిడిగా చర్చలు జరిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో జులై 1 నుంచి 30 వరకు పాఠశాలలు తెరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కాబట్టి ప్రత్యేకంగా విద్యార్థులకు వర్క్ షీట్లు ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించారు. సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్లో 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు వచ్చే అనుమానాలు నివృత్తి చేసేందుకు, వర్క్ షీట్లు సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని తెలిపారు. తల్లిదండ్రుల ద్వారా గానీ, సచివాలయ వాలంటీర్ల ద్వారా గానీ పిల్లలకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుమానాలుంటే ఫోన్లో ఉపాధ్యాయులు నివృత్తి చేయాలనితెలిపారు. వారంలో ఒకరోజు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలని తెలిపారు. దీనికి సంఘాల నాయకులు అంగీకరించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా వారంలో ఒకరోజు పిల్లల ఎన్రోల్మెంట్, పుస్తకాల పంపిణీపై సలహాలు ఇవ్వాలని కోరగా...ఈ  ప్రతిపాదనలకు అన్ని సంఘాలూ అంగీకారం తెలిపాయి.



*♦ఉమ్మడి సర్వీస్ రూల్స్ పై అనధికార చర్చ* 


ప్రభుత్వ, పంచాయతీ ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ వివాదంపై ఉపాధ్యాయ సంఘాలతో డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి అనధికారికంగా చర్చలు జరిపారు. ఎంఇఓ డిప్యూటీ డిఇఓ, డిఇఓ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రతాప్ రెడ్డి సంఘాలు ముందు ఉంచారు. ఈ ప్రతిపాదనలన్నీ సంఘాలు ఒప్పుకుంటే ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. సుప్రీం కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేయాలని యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ చెప్పారు. ఆ తరువాతే ఇలాంటి అంశాలపై చర్చించాలని సూచించారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరు దివాన్ మొయి ద్దీన్, జోసెఫ్ సుధీర్ కుమార్ (ఎస్టియు), డిటిఎఫ్ (నరహరి), గణపతిరావు (ఆష్టా), జివి నారాయణరెడ్డి (ప్రధానోపాధ్యాయుల సంఘం) వి.రెడ్డి శేఖర్ రెడ్డి (వైఎస్ఆర్ఎఫ్), అప్పారావు, (టిఎస్ యుఎస్) తదితరులు పాల్గొన్నారు..


*ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో SCERT డైరెక్టర్ జెడి B.ప్రతాపరెడ్డి గారు ఇబ్రహీంపట్నం లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.*

*సంఘాలు చర్చించిన ప్రధానమైన అంశాలు:*


👉  *పాఠశాలల పునః ప్రారంభం.*


 *జూలై నెలలో పాఠశాలల పునః ప్రారంభం ఉండదని కానీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా మరియు దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేయాలని, దానికి కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. నిర్వహణ, మూల్యాంకనం గురించి సూచనలను అడిగారు*.


  *ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆన్లైన్ నందు విద్యాబోధన అవసరం లేదని, 9 మరియు పదవ తరగతి లకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేపడుతూ, ఆ అంశాలపై గల* *అసైన్మెంట్ ల పర్యవేక్షణ కొరకు వారానికి ఒకరోజు 10 am - 1pm వరకు నిర్వహించేలా,* *విద్యార్థులను పాఠశాలకు వచ్చే అవసరం లేకుండా ఈ కార్యక్రమం మొత్తం వాలంటీర్ల ద్వారా జరిపే విధంగా చేయాలని తెలియజేయడమైనది*.


👉  *అడ్మిషన్ల గురించి వివరణ అడగగా పాఠశాలలు ప్రారంభించిన తర్వాతే అడ్మిషన్ల అంశం వచ్చునని తెలియజేశారు.*


👉  *సర్వీస్ రూల్స్ విషయం గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం వైపు నుండి కొన్ని ప్రతిపాదనలు తెలియజేయడం జరిగినది ఏ మేనేజ్మెంట్ వారికి ఆ మేనేజ్మెంట్ ల వారీగా,  వీటిలో ప్రత్యేకించి 13 డీఈఓ పోస్టులు, 49 డిప్యూటీ ఈవో పోస్టులు మరియు 666 ఎం ఈ ఓ పోస్టులను నూతనంగా సర్వీస్ రూల్స్ తో సంబంధం లేకుండా 100% జిల్లాపరిషత్ వారితోనే నియామకం చేసేలా శాంక్షన్ చేయించుటకు కృషి చేస్తామని తెలిపారు.* 


👉 *జె ఎల్స్ మరియు డైట్ లెక్చరర్స్ విషయం గురించి అడగగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్రింద ఎన్ని జూనియర్ కళాశాలలు ఏర్పాటు జరుగుచున్న కారణంగా ఆ తరువాత  ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు జిల్లా పరిషత్ వారితోనే ఆయా పోస్టులను భర్తీ చేసేలా చర్యలు అని తెలిపారు.*


0 comments:

Post a Comment

Recent Posts