Thursday, 17 June 2021

AP 2021-22-Job Calender will Release Today

AP 2021-22-Job Calender will Release Today

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టులు, వాటి భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన కొలిక్కి వచ్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ ఆ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉన్న పోలీసు, విద్యా, వైద్య శాఖల్లో పోస్టుల వివరాలు, ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీల వివరాలను పేర్కొనడంతో పాటు వాటిని ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారు? వాటి రాత, మౌఖిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే స్పష్టమైన వివరాలన్నీ క్యాలెండర్‌లో పేర్కొంటారు. 


అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అధికారులు సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే పనిని కొలిక్కి తీసుకువచ్చారు. ఏపీపీఎస్సీ అధికారుల సహకారమూ తీసుకుంటున్నారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌, ఇతర అధికారులు దీనిపై వరుసగా సమావేశమవుతున్నారు.

AP 2021-22-Job Calender will Release Today




2021, జూలై నుంచి జరపనున్న ఉద్యోగ నిమామక వివరాలు
AP 2021-22-Job Calender will Release Today


ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఎంత మంది


జూలై-2021 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238


ఆగస్టు-2021 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 36


సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450


అక్టోబర్‌ - 2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451


నవంబర్‌ -2021 పారామెడికల్‌ సిబ్బంది 5,251


డిసెంబర్‌ - 2021 నర్సులు 441


జనవరి -2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240


ఫిబ్రవరి -2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000


మార్చి -2022 ఇతర శాఖలు 36


భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143



0 comments:

Post a Comment

Recent Posts