Wednesday, 23 June 2021

AP Disha App :ప్రతింటికి వెళ్లి మహిళల సెల్ ఫోన్ లలో దిశ యాప్ డౌన్ లోడ్

 AP Disha App : ఏపీ రాష్ట్రంలో ప్రతింటికి వెళ్లి మహిళల సెల్ ఫోన్ లలో దిశ యాప్ డౌన్ లోడ్ చేసేలా చూడాలని, ఇది వార్డు వాలంటీర్ల బాధ్యత అని సీఎం జగన్ వెల్లడించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి కనబర్చాలని, దిశ యాప్ పై పూర్తి చైతన్యం కలిగించాలని అధికారులకు సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల భద్రతపై అధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. యాప్‌ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలని సూచించారు. మహిళలను ఆదుకునేలా వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలని, దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలన్నారు.


గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శి పేరును ఇకపై మహిళా పోలీస్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలని జగన్‌ ఆదేశించారు.


ప్రధానంగా..మహిళా పోలీసులు, వాలంటీర్లతో సచివాలయాల్లో ప్రత్యేక అవగాహన కలిగించాలన్నారు. ముందుగా మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. వీరి ద్వారా..మహిళలకు అవగాహన కలిగించాలని ఆదేశించారు సీఎం జగన్‌. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ నేర్పించాలన్నారు. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్‌. ఇక కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కలిగించాలన్నారు సీఎం జగన్.


0 comments:

Post a Comment

Recent Posts