అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు బదులుగా ఈప్‌సెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈప్ సెట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్ 24 విడుదల చేస్తామని.. 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటి క్రితం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించిన ఆయన జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుండి జూలై 25వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలు కూడా సెప్టెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు.
0 comments:
Post a Comment