సెకండ్ హాండ్ కార్ల కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా?
సెకండ్ హాండ్ కార్ల కొనుగోలుకు బ్యాంకుల రుణ రేట్లు 7.3% నుండి ప్రారంభమవుతున్నాయి. సెకండ్ హాండ్ కారును లోన్‌లో తీసుకోవాలనుకుంటే కొన్ని బ్యాంకులు తగిన వడ్డీ రేట్లకే రుణాలిస్తున్నాయి. దేశంలోని 20 ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న సెకండ్ హాండ్ కార్ల రుణాలపై ప్రస్తుత వడ్డీ రేట్ల జాబితా ఈ కథనంలో తెలుసుకోందాం.
కారు కొనడం చాలా మందికి చాలా ముఖ్యమైన ఆర్థిక దశ. కానీ కారు కొనడం విలువపరంగా పెద్ద కొనుగోలు. దీనికి సరైన ప్రణాళిక అవసరం. కారు కొనుగోలుకు భారీ ఖర్చు తగ్గించుకోవడానికి సెకండ్ హాండ్ కొనుగోలుకు ప్రయత్నించడం తెలివైన పనే. ఇది మీకు నచ్చిన వాహనం, కారు మోడల్‌ను తక్కువ ధరకు పొందేలా చేస్తుంది.
అయితే సెకండ్ హాండ్ కారుకు రుణం తీసుకోవాలనుకుంటే వర్తించే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ ఛార్జీలు, ఈఎమ్ఐ మొత్తం, అర్హత, డాక్యుమేంటేషన్ అవసరాలు మొదలైన వాటి కోసం పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. ఉపయోగించిన కారు లోన్ వడ్డీ రేట్లు కొన్ని సందర్భాల్లో కొత్త కారు లోన్ వడ్డీ రేట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అలాగే, అనుబంధ నిబంధనలు, షరతులు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. ఉదాః కొన్ని రుణ సంస్థలు ఈ రుణాలను 3 ఏళ్ల లోపు లేదా గరిష్టంగా 5 ఏళ్ల కాలపరిమితిగల (తయారైన) కార్లపై మాత్రమే అందించవచ్చు. చాలా రుణ సంస్థలు ముందస్తు యాజమాన్యంలోని కారు విలువలో 60% వరకు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తారు. మిగిలిన మొత్తాన్ని కారు కొంటున్నవారే సొంతంగా భరించాలి.
దేశంలోని 20 ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న సెకండ్ హాండ్ కార్ల రుణాలపై 5 ఏళ్ల కాల వ్యవధిలో రూ. 10 లక్షల రుణం తీసుకుంటే ఈఎమ్ఐ ఎంత పడుతుందో ఈ క్రింది టేబుల్‌లో ఉంది.
5 సంవత్సరాలలో రుణం తీర్చే కాల వ్యవధికి, రూ. 10 లక్షల రుణానికి ఈఎమ్ఐ ఎంత ఉంటుందో ఇక్కడ ఉంది. ప్రతీ బ్యాంకు రూ. 10 లక్షల వరకు రుణం కోసం తక్కువ రుణ వడ్డీ రేట్లను ప్రకటించిన బ్యాంకు వివరాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈఎమ్ఐ లెక్కల్లో ప్రాసెసింగ్ ఫీజు, మరే ఇతర ఛార్జీలను ఇక్కడ చేర్చలేదు. రుణం ఇచ్చేటప్పుడు ఆయా వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌ను కూడా పరిగణనలోకి బ్యాంకులు తీసుకుంటాయి.
0 comments:
Post a Comment