Wednesday, 16 June 2021

విద్యాశాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక నిర్ణయం

 *✨ పదవ తరగతి*


★ ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు *కీలక వ్యాఖ్యలు* చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు. 


★ *జులై 26 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు* పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు.

*టెన్త్ పరీక్షలకి 6.28 లక్షల* మంది విద్యార్ధుల హాజరవుతారని చెప్పారు. 


★ *4వేల సెంటర్లలో* పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. 

పరీక్షల నిర్వహణలో *80వేల మంది టీచర్లు*, సిబ్బంధి పాల్గొంటారని వెల్లడించారు. 


★ కాగా, 11 పేపర్ల బదులు *ఏడు పేపర్లకి* పరీక్షలు నిర్వహించాలని సూచించాం అన్నారు. *సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు* వెల్లడిస్తామన్నారు. 


★ *రేపు(జూన్ 17,2021) విద్యాశాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక నిర్ణయం* తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు.

0 comments:

Post a Comment

Recent Posts