Thursday, 17 June 2021

బుల్లిపిట్ట:: ఇకపై ఏసీ తో పనిలేదు

 సాధారణంగా వేసవికాలం అంటే చాలు.. ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. ఎందుకంటే మండే ఎండల్లో ఉక్కపోతను భరించలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆ బాధను తగ్గించుకోవడానికి చాలా మంది ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వంటివి ప్రత్యేకంగా కొనుగోలు చేసి మరీ చల్లదనాన్ని పొందుతూ ఉంటారు. ఇక వీటి వల్ల కరెంటు బిల్లు కూడా అంతే స్థాయిలో పెరిగిపోయి , సామాన్యులకు ఆర్థికంగా కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అయితే ఇప్పుదు ఏ సీ లతో , కూలర్ లతో ఎలాంటి పని లేకుండా కేవలం ఇంటిపై ఒక పేపర్ పరిస్తే చాలు ఇల్లంతా చల్లబడిపోతుంది. దీనిని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ పేపర్ యొక్క ప్రత్యేకత ఏమిటి? దీని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది ?అనే విషయాలను తెలుసుకుందాం.


ఇటీవల అమెరికాలో ఈశాన్య విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక ప్రత్యేకమైన కాగితాన్ని తయారు చేశారు. దీనికి #8216 ,#8217 కూలింగ్ అని పేరు కూడా పెట్టారు. ఇల్లు అలాగే భవనాలు చల్లబరచాలి అంటే ఈ కాగితాన్ని కప్పుకోవాలి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా ఈ కాగితాన్ని కప్పి ఉంచిన ఇల్లు, భవనాలకు ఏసీలు , కూలర్ల అవసరం ఉండదని వారు అంటున్నారు.



ఈ కాగితం అతి తేలిక పాటి రంగుతో ఉంటుంది అని పరిశోధకులు యీ. జంగ్ చెప్పారు. ఇళ్ళ పై పడే సూర్యుని నుంచి వెలువడే బలమైన కిరణాలను ప్రతిబింబింప చేస్తుంది. అంతేకాకుండా మనిషి శరీరం నుండి వెలువడే వేడి, ఇల్లు అలాగే భవనాలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు , వంట నుండి వెలువడే వేడి వంటి ఉష్ణోగ్రతలను ఈ కాగితం ఆకర్షిస్తుంది. దీనిని మైక్రో ఫైబర్ తో తయారు చేశారు కాబట్టి ఎక్కువగా వేడిని గ్రహిస్తుంది.అదేవిధంగా వాతావరణాన్ని కూడా చల్లబరుస్తుంది అని శాస్త్రవేత్త యీ జాంగ్ తెలిపారు.


ఈ కాగితం ఉపయోగించడం వల్ల 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గించుకోవచ్చు. ఈ కాగితం పర్యావరణ అనుకూలంగా పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు అంతేకాకుండా దీనిని రీసైకిల్ కూడా చేయవచ్చు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, రీసైక్లింగ్ చేసిన తర్వాత కూడా ఇది కొత్త కాగితంలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇక ఈ కాగితాన్ని ఇంటి పైకప్పు పై పరచడం వల్ల ఇంట్లో చక్కటి చల్లదనాన్ని పొందవచ్చు

0 comments:

Post a Comment

Recent Posts