ఏసీ లకు బదులు ఫ్యాబ్రిక్ వస్త్రం
ఫ్యాబ్రిక్ వస్త్రంతచింటి గది ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థిని శ్రీలేఖ భవనేశ్వరి చెబుతున్నారు. దీనిపై ఆమె చేసిన పరిశోధన వివరాలను ఆదివారం వెల్లడించారు. బీఎస్సీ (భౌతికశాస్త్రం) చివరి సంవత్సరం చదువుతున్న శ్రీలేఖ సహారా ఏడారిలో జీవించే చీమల శరీరతత్వాన్ని అధ్యయనం చేశారు.
అందుకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ క్లాత్ రూపకల్పన చేస్తే గది ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చని చెబుతున్నారు. సహారా ఏడారిలోని చీమల శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత కంటే వీటి శరీర ఉష్ణోగ్రత 5 నుంచి 10 డిగ్రీలు తక్కువగా ఉంటుంది.
ఈ తరహా చీమలకు ఉండే వెంట్రుకలు సూర్య కిరణాలను నేరుగా శరీరంలోనికి వెళ్లకుండా అడ్డుకుని ఆయా కిరణాలు పరావర్తనం చెందేలా చేస్తాయి. దీనివల్ల ఈ చీమలు అధిక ఉష్ణోగ్రతల్లోనూ మన గలుగుతున్నాయి. ఇదే సూత్రాన్ని అధ్యయనం చేసిన శ్రీలేఖ ఈ తరహా గుణమున్న సైంటిఫిక్ (ఫ్యాబ్రిక్) క్లాత్ను తయారు చేస్తే నివాస గహాల గది ఉష్ణోగ్రతను తగ్గించవచ్చని అంటున్నారు.
పర్యావరణ హితమైన ఫ్యాబ్రిక్ వస్త్రాల తయారీ వల్ల వేడిమి నేరుగా గది లోపలకు చేరే వీలుండదని శ్రీలేఖ చెబుతున్నారు. దీనిద్వారా ఏసీ, ఇతర శీతలీకరణ వస్తువులు వినియోగాన్ని తగ్గించొచ్చని, గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలనూ తగ్గిస్తుందని చెబుతున్నారు. ఈ పరిశోధనలో తనకు అన్ని విధాలా సూచనలిచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సభ్యసాచి ముఖోపాధ్యాయకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన పరిశోధనా ప్రాజెక్టు వివరాలను తెలియజేస్తూ ఇండియన్ పేటెంట్ కోసం ఇటీవల ధరఖాస్తు చేసినట్లు శ్రీలేఖ తెలిపారు.
0 comments:
Post a Comment