సుప్రీం కోర్టులో ఈరోజు పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విచారణ జరిగిన నేపథ్యంలో గౌరవ౹౹ విద్యాశాఖా మంత్రి సురేష్ గారి తాజా స్పదన..
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై గౌరవ౹౹ విద్యాశాఖా మంత్రి సురేష్ గారి తాజా స్పదన..
Exams In AP: ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ఇంత వరకు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. రెడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటాన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా పరీక్ష హాల్‌లో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే అనుతమిస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇద్దరు విద్యార్థుల మధ్య కనీసం 5 అడుగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు.
ఇక ఈ విషయాలన్నీ విన్న కోర్టు తగినన్నిజాగ్రత్తలు తీసుకుంటే.. పరీక్షలకు అనుమతిస్తామని కోర్టు తెలిపింది. ప్రభుత్వం చెప్పిన అంశాలన్నింటినీ అఫిడవిట్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణలో భాగంగా విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరీక్షలను నిర్వహిస్తామని చెబుతోంది.
0 comments:
Post a Comment