వాస్తు శాస్త్రం ప్రకారం, లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో ఎక్కడ ఉంచితే శుభ ఫలితాలు వస్తాయో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం, లాఫింగ్ బుద్ధ సంపద, శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, సంపద, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటారు. లాఫింగ్ బుద్ధను సానుకూల ప్రభావాలకు ప్రతీకగా భావిస్తారు.
అందుకే చాలా మంది తమ ఇళ్లలో లాఫింగ్ బుద్ధను తమ ఇళ్లలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని భావిస్తారు. అయితే మీ ఇంట్లో ఈ దిశలలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచితే.. మీకు సరైన శక్తి ఉత్పత్తి చేయడంతో పాటు మీ సంపదర పెరుగుతుందట. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మార్చేందుకు కూడా సహాయపడుతుందట. ఈ సందర్భంగా మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఏ చోట ఉంచాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రధాన ద్వారంలో..
మీ ఇంట్లోని ప్రధాన ద్వారం దగ్గర లాఫింగ్ బద్ధుని విగ్రహాన్ని ఉంచాలట. అది మీకు కంటికి కనబడేలా మరియు తక్కువ ఎత్తులా ఉండేలా చూసుకోవాలట. అయితే మీరు బుద్ధుని విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశంలో ఎప్పటికీ ఉంచకూడదట. అలాగే పైనుండి ఎప్పుడూ చూడకూడదట. సంపద మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి మీరు విగ్రహాన్ని ఇంట్లోని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచేలా చూసుకోండి.
నేలపై ఉంచకూడదు..
బుద్ధుని విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టినా.. నేలపై ఉంచరాదని గుర్తుంచుకోండి. భూమి నుండి కనీసం నాలుగైదు అడుగుల పైన ఉంచాలనే విషయాన్ని ఎప్పటికీ మరువకండి. మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు బుద్ధుడిని ప్రార్థన గదిలో ఉంచి ద్యానించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయట.
ఆశీర్వాద భంగిమలో..
మీ ఇంట్లోని ప్రవేశ ద్వారం వద్ద బుద్ధుడు ఆశీర్వాద భంగిమలో ఉండేలా చూసుకోవాలట. ఇలాంటి బుద్ధుని విగ్రహం ఉంచడం వల్ల అన్ని వ్యతిరేక శక్తులు ఇంటి నుండే బయట ఉండిపోతాయట. ఇలాంటి బుద్ధుని విగ్రహం వల్ల మీ ఇంట్లో రక్షణ ముద్ర అర్థం.. ఓ వైపు ఆశీర్వాదం ఇవ్వడం.. మరొకటి పరిసరాలను రక్షించడం.. అని పండితులు చెబుతున్నారు.
పడమర దిశలో..
వాస్తు శాస్త్రం ప్రకారం బుద్ధుడిని పడమర వైపు దిశలో చూస్తున్నట్టుగా గదిలో కుడివైపుగా ఉంచితే మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుందట. మీరు శుభ్రమైన సెల్ఫ్ లో, లేదా టేబుల్ మీద పెట్టడం మీ ప్రశాంతమైన మానసిక స్థితిని సూచిస్తుందట.
ద్యానం చేసే బుద్ధుడిని..
మీకు సాయంత్రం వేళ తోటలో లేదా పార్కుల్లో నడిచే అలవాటు ఉంటే.. అక్కడ ఓ శుభ్రమైన ప్లేసులో ద్యానం చేస్తున్న బుద్ధుడిని ఉంచాలట. అలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుదట. ఆ బుద్ధుని విగ్రహం చుట్టూ దీపాలను వెలిగిస్తే, మీకు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుందట.
ఏకాగ్రత పెరిగేందుకు..
చాలా మంది బుద్ధిస్టులు.. తమ ధ్యాన మందిరంలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచుకుంటారు. దీని వల్ల తమ ఏకాగ్రత పెరుగుతుంది. దీన్ని తూర్పు దిశలో ఉంచొచ్చు. ఎందుకంటే ఇది శాశ్వత జ్ణానం, జ్ణానోదయాన్ని సూచిస్తుంది. దీని వల్ల మీకు పూర్తి మనశ్శాంతి లభిస్తుందట. అలాగే పూజ గదిలో దీర్ఘముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చు.
బుద్ధుని భంగిమలు..
వాస్తు శాస్త్రం ప్రకారం, రకరకాల బుద్ధుని భంగిమలు ఉంటాయి. అవి రకరకాల అర్థాలనిస్తాయి. విద్య సంబంధిత విషయాల్లో విజయం సాధించేందుకు బుద్ధుని తల మాత్రమే ఉన్న చిన్న విగ్రహాన్ని లేదా నిద్రపోతున్న భంగిమలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని తూర్పు దిశలో పెట్టుకోవాలి.
చేత్తో వేసిన బుద్ధుడిని..
చేత్తో వేసిన బుద్ధుడి పెయింటింగ్ ను మీ డైనింగ్ టేబుల్ లేదా ఎంట్రెన్స్ కు దగ్గరగా ఉన్న గోడకు వేలాడదీయడం వల్ల ఇంట్లో ప్రశాంతతో పాటు మీ ఇంటికి ఆకర్షణీయత పెరుగుతుందట. అయితే బుద్ధుని విగ్రహం ఎల్లప్పుడూ ఇంటి లోపలే ఉండాలట. ఆ విషయాన్ని ఎప్పటికీ మరచిపోకూడదట.
ఇవి గుర్తుంచుకోండి..
చివరగా లాఫింగ్ బుద్ధ.. గౌతమబుద్ధుడు ఒకటి కాదని గుర్తుంచుకోండి. అయితే మీ ఇంట్లో శాంతి నవ్వులు పూయించాలని కోరుకుంటే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లోని పుస్తకాల అర లేదా షో కేస్ సెల్ఫ్ లో ఉంచండి. అయితే ఇది తూర్పు దిశలో ఉండాలని గుర్తుంచుకోండి
0 comments:
Post a Comment