Monday 28 June 2021

వ్యాధి నిరోధక శక్తిని పెంచే, ఇంట్లో పెంచుకునే ఆ ఔషధ మొక్కలేవో తెలుసుకుందాం

 పూర్వం నగరాలు తక్కువగా ఉండేవి కాబట్టి కాలుష్యం తక్కువగా ఉండేది. అందువల్ల ఆటోమేటిక్‌గా ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు పొల్యూషన్ కారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. మరి మన ఆరోగ్యాన్ని, వ్యాధి నిరోధక శక్తిని పెంచే, ఇంట్లో పెంచుకునే ఆ ఔషధ మొక్కలేవో తెలుసుకుందాం. వాటి ఆకులు, పూలు, గింజలను కూరల్లో, టీలలో, సూప్‌లలో వాడటం ద్వారా ఆరోగ్యం పెంచుకోవచ్చు. 


శతవారీ (Shatavari) : ఇదో ఆయుర్వేద మొక్క.

సైంటిఫిక్‌గా ఆస్పర్‌గస్ రేమ్సోసస్ (Asparagus racemosus) అంటారు. ఇది ఒత్తిడి, టెన్షన్లను తగ్గిస్తుంది. బాడీలోకి విష వ్యర్థాల్ని రానివ్వదు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. డయేరియాను ఆపేస్తుంది. చాలా తేలిగ్గా పెరిగే మొక్క ఇది. (credit - twitter - nethu amanda)

అశ్వగంధ (Ashwagandha) : ఇదో ఔషధ మొక్క. ఇది శరీరానికీ, బ్రెయిన్‌కీ ఎంతో మేలుచేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. కండరాల శక్తిని పెంచుతుంది. సంతాన భాగ్యం కూడా కలిగిస్తుంది. ఇంటి గార్డెన్‌లో ఈ మొక్కను పెంచుకోవచ్చు. (credit - twitter - Ayurvedic HQ)

అలోవెరా (Aloe Vera) : ఇదో అద్భుత మొక్క. నిండా ఔషధ గుణాలే. చుట్టూ 80 అడుగుల దూరంలో గాలిని క్లీన్ చేస్తుంది. గాయాల్ని నయం చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఎక్కువ నీరు పొయ్యకుండానే ఈ మొక్క అలా బతుకుతూనే ఉంటుంది. ఒక్క మొక్కతో... పదుల మొక్కలు పుట్టుకొస్తాయి.

తులసి (Tulsi) : ఇండియన్స్ తప్పక పెంచుకునే మొక్క ఇది. నిండా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒత్తిడిని దూరం చేస్తుంది. తలనొప్పి, కళ్లలో దురద, కీళ్లనొప్పులు, చర్మ వ్యాధులు, డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. ఇది ఇండియాకి చెందిన మొక్క. (credit - twitter - NYC Tulsi Devi)

మెంతి (Fenugreek) : మెంతులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తల్లిపాలను పెంచుతాయి. డయాబెటిస్ తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. వేడిని తగ్గిస్తాయి. అన్నీ లాభాలే. ఈజీగా పెరిగే మొక్కల్లో ఇది కూడా ఉంది. (credit - twitter - foodthesis)

0 comments:

Post a Comment

Recent Posts