Monday, 7 June 2021

మంచిమాట:: సహనానికి మించిన సంపద లేదు...

 మంచిమాట:: సహనానికి మించిన సంపద లేదు.... 

సహనం అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. ఒకవేళ మనిషి సహనాన్ని ఎప్పుడైతే కోల్పోతాడో, అప్పుడు ఆ మనిషి కాస్త మృగంగా మారుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇందుకు ఉదాహరణగా మేము ఒక కథను వినిపిస్తాము.


అనగనగా ఒక ఊరిలో ఓ యువకుడైన తండ్రి, తన చిట్టిబాబును వొళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చి ఒక కాకి ఎదురింటి పెంకుల పై వాలింది. ఆ బాబు తండ్రిని.. నాన్న అదేమిటి ? అని అడిగాడు. అప్పుడు తండ్రి సమాధానంగా .. అది కాకి అని సమాధానం ఇచ్చాడు. తండ్రిని మళ్లీ ఆ బాబు నాన్న అదేమిటి ? అని అడిగాడు తండ్రి మళ్ళీ బాబు అది కాకి అని చెప్పాడు. ఇక ఆ కొడుకు పదే పదే అదేమిటి ? అదేమిటి?

అని తండ్రిని మళ్ళీ మళ్ళీ అడగడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి కూడా ఓపికగా మళ్లీ మళ్లీ అది కాకి అని బదులిస్తూ వచ్చాడు.

అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. బాబు పెరిగి, పెద్దవాడయ్యాడు. ఇక తండ్రేమో ముసలివాడు అయ్యాడు. ఓ రోజు తండ్రి చాప మీద కూర్చున్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకుని అడిగాడు.. ఎవరు బాబు వచ్చింది ? అని, కొడుకు వచ్చిన అతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్ఛారు. ఇక మళ్లీ ఎవరు వచ్చారు ? బాబు అని తండ్రి అడిగాడు. ఇక విసుగ్గా కొడుకు బదులిచ్చాడు. మీరు ఒక చోట కుదురుగా పడి ఉండకూడదు. పని పాట లేదు, కానీ ఎవరు వచ్చారు ? ఎవరు వచ్చారు ? అంటూ దినమంతా ఒకటే ఆరా తీస్తుంటారు అంటూ తండ్రిని గట్టిగా నిట్టూర్చుతూ, చేత్తో తల పట్టుకున్నాడు ఆ కొడుకు.


ఇక ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు తండ్రి . నేను నిన్ను ఓసారి అడిగితేనే , నీవు విరుచుకుపడుతున్నావే, కానీ నువ్వు మాత్రం నన్ను వంద సార్లు ఇదేమిటి ?ఇదేమిటి ? అంటూ వేధించే వాడివి. ఇక నేను నిన్ను ఎప్పుడైనా కసురుకున్నానా. ? నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడినిగా.. తల్లిదండ్రులను కసిరే వారు మంచి వాళ్లు కాదు సుమా.. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలోనే మీ అమ్మనాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఒకసారి ఆలోచించండి.

0 comments:

Post a Comment

Recent Posts