ఆధార్- పాన్ కార్డు అనుసంధాన గడువు పొడగింపు
ఆధార్- పాన్ కార్డు అనుసంధాన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేసుకోవాల్సిన వారు సెప్టెంబర్ 30 వరకు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.ఆధార్ పాన్ లింక్‌కి ఈ నెల 30 న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తుంది. అయితే దేశంలో కరోనా మహామ్మారి విజృంభిస్తుండటంతో దీనికి మూడునెలల పాటు గడువు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంకా గ్రామాల్లో చాలామంది ఆధార్-పాన్‌కార్డు అనుసంధానం చేయలేదు.కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా పక్రియకు ఆటంకం కలగడంతో కేంద్రం దీనిని పొడిగించింది.కరోనా చికిత్సకు చెల్లించడానికి పన్నురాయితీలకు సంబంధించిన వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2019-20 లేదా 2020-21 సంవత్సారినికి కరోనాతో మరణించిన వారి కుటుంబానికి వచ్చే ఎక్స్‌గ్రేషియా చెల్లింపుపై పన్ను విధించడంలేదని కేంద్రం తెలిపింది.ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకం వివాద్ సే విశ్వస్ కింద చెల్లింపుల గడువును ఆగస్టు 31 వరకు అంటే రెండు నెలల వరకు ప్రభుత్వం పొడిగించింది.
0 comments:
Post a Comment