పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెపిన మోదీ సర్కార్
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెన్షన్ తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ కు కీలక సవరణలు చేసింది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే వాళ్లకు ఊరట కలగనుంది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ నిబంధనల సడలింపు వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వాళ్లలో ఎక్కువమందికి ప్రయోజనం చేకూరనుంది. నూతన నిబంధనల ప్రకారం పెన్షన్ పొందే వాళ్లకు ప్రొవిజనల్ ఫ్యామిలీ పెన్షన్ వెంటనే అందనుంది. ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ పెన్షన్ క్లెయిమ్ రశీదు అందించడం ద్వారా ప్రొవిజనల్ ఫ్యామిలీ పెన్షన్ ను వెంటనే పొందడం సాధ్యమవుతుంది.
కరోనా వైరస్ లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందితే ఈ పెన్షన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఆ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రొవిజనల్ పెన్షన్ అందనుంది. సాధారణంగా పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్‌కు పంపిన తర్వాతే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పే అండ్ అకౌంట్స్ ఆఫీస్‌కు ఫ్యామిలీ పెన్షన్ పంపకముందే అర్హులకు పెన్షన్ చెల్లించడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సర్వీస్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన కుటుంబాలకు ఈ పెన్షన్ వల్ల ప్రయోజనం చేకూరనుంది.
0 comments:
Post a Comment