Monday, 21 June 2021

శిశు విద్యా రంగంలో లిటిల్ మిలీనియమ్ సరికొత్త సంచలనం

 సంప్రదాయక,డిజిటల్ శిక్షణ విధానాల అద్భుత సమ్మేళనం

 'బ్లెండింగ్ లెర్నింగ్' ఆవిష్కరణ సందర్భంగా లిటిల్ మిలీనియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమన్ బజాజ్ మాట్లాడుతూ.. ''దేశవ్యాప్తంగా లాక్ డౌన్, కరోనా మహమ్మారి కారణంగా ప్రిస్కూల్స్ మూతపడడంతో తల్లిదండ్రులు తమ చిన్నారుల చదువు గురించి బాధపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా లిటిల్ మిలీనియం ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (శిశు విద్య) ప్రాధాన్యం గురించి చాటిచెబుతూనే ఉంది. 


ఒక చిన్నారి జీవితంలో 0-6 ఏళ్లు అనేవి అద్భుతమైన సంవత్సరాని మేం విశ్వసిస్తాం. ఎందుకంటే 90% దాకా మెదడు అభివృద్ధి అంతా కూడా ఈ వయసు లోనే జరుగుతుంది. తగిన సంరక్షణ తీసుకోకపోతే, పిల్లలు తమ శక్తిసామర్థ్యాలను అందుకోలేక పోతారు, అందుకే చదువు ఈ వయసులో చాలా ముఖ్యమైనది, దానిని కొనసాగించాలి అని సూచించారు.

ప్రతీ కార్యకలాపం కూడా విద్యాభ్యాస ఆశయాలకు అనుగుణంగా ఉండేలా చిన్నారులకు అవసరమైన అభివృద్ధి యొక్క ఏడు విభాగాలలో ఉండేలా బ్లెండెడ్ లెర్నింగ్ చూస్తుంది. శిశువిద్య వయసులో అసలేమీ చదువుకోకపోవడం కంటే కూడా వర్చువల్ మోడ్ లో నైనా చదువు కోవడం గణనీయంగా మంచిదని 90 శాతం తల్లిదండ్రులు భావిస్తున్నట్లుగా మా అధ్యయనంలో, తల్లిదండ్రుల సర్వేల్లో వెల్లడైంది. దీంతో పిల్లలు తమ అభివృద్ధి మైలురాళ్ళ దిశగా చురుగ్గా భాగస్వాములు కాగలుగుతారు, ముందుకెళ్లగలుగుతారు. 



ఆన్ లైన్ తరగతుల నిర్మాణం, రోజువారీ కార్యకలాపాలు ఎన్నో ప్రయోజనాలను అందించగలుగుతాయి.

పిల్లలు తరచూ టీచర్స్ తో మరియు ఒకరితో ఒకరు పరస్పరం మాట్లాడుకోవటం వలన సామాజిక - ఆర్థిక నైపుణ్యాలు పొందగలుగుతారు. పిల్లలు స్క్రీన్ చూడాల్సిన సమయం కూడా వారి ఇతర కార్యకలాపాలకు వీలు కల్పించేలా నిర్మాణాత్మకంగా ఉంటుంది. మా బ్లెండెడ్ లెర్నింగ్ విధానం అనేది ప్రిస్కూల్ ను రిప్లేస్ చేసేది కాదు, ప్రిస్కూల్ అనుభూతిని మరింత ముమ్మరం చేస్తుంది, విస్తరిస్తుంది. 


అవసరమైన చోట ప్రగతిశీలకంగా సాంకేతికతను ఒక మాధ్యమంగా వినియోగిస్తోంది. ఇది ఒక విధంగా ఇంట్లోనే అత్యుత్తమ విద్యానిపుణుల నుంచి నేర్చుకోవడాన్ని ఆనందించడం లాంటిది - సురక్షితంగా, సౌకర్యవంతంగాకూడా'' అని అన్నారు.

0 comments:

Post a Comment

Recent Posts