Monday 7 June 2021

వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

 వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్


వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కేంద్రమే కంపెనీల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందజేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై కేంద్రమే పూర్తిగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. 75 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రమే రాష్ట్రాలకు అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. 25 వ్యాక్సిన్ డోసులు ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు.


ఇకపై రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.


దేశంలో ప్రస్తుతం ఏడు కంపెనీలు వివిధ దశల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరో మూడు కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతోందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌తో దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని అన్నారు. ఈ మహమ్మారి కారణంగా అనేక మంది ఆత్మీయులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక ప్రపంచం ఎప్పుడూ ఇలాంటి మహమ్మారిని చూడలేదని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని.. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డిందని ప్రధాని మోదీ అన్నారు. తక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకున్నామని తెలిపారు. మహమ్మారి కట్టడి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదల్లేదన్న ప్రధాని మోదీ.. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మరోసారి స్పష్టం చేశారు.


దేశంలె కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్లు ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి వ్యాక్సిన్ తయారీలో దేశం ఎంతో వెనుకబడి ఉందని.. ఈ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాల కారణంగా పరిస్థితి ఎంతగానో మెరుగైందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఒక ఏడాది కాలంలోనే రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు భారత్ ఏ మాత్రం తీసిపోదని నిరూపించామని అన్నారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలోనే వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని.. వ్యాక్సిన్ తయారు చేసే వారికి ప్రొత్సహించామని గుర్తు చేశారు.


దేశంలో సెకండ్ వేవ్‌కు సంబంధించిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 100636 కొత్త కేసులు వెలుగు చూశాయి. 61 రోజుల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొత్తగా కరోనా కారణంగా 2427 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1401609గా ఉంది. ఉన్నాయి. కొత్త కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటివరకు మొత్తం 28909975 మంది కరోనా బారిన పడ్డారు


0 comments:

Post a Comment

Recent Posts