హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారులతో మంత్రి సబితా సమీక్ష నిర్వహించారు.
సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ..'రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేశాం. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తాం. ఫలితాలపై త్వరలో విధి విధానాలు రూపొందిస్తాం. విద్యార్థులెవరైనా పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆలోచిస్తాం.
ఫలితాల వెల్లడిపై త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని' పేర్కొన్నారు.
0 comments:
Post a Comment