Breaking News
Intermediate, 10th Class Exams Cancelled-AP Govt
*ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, మరియు టెన్త్ పరీక్షలు రద్దు.....విద్యాశాఖ మంత్రి సురేష్ గారు*
*జులై 31లోపు ఎగ్జామ్ ప్రాసెస్ పూర్తి చేయడం సాధ్యం కాదు.అందుకే పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేశాము.*
*మార్కులు ఎలా ఇవ్వాలన్నాదానిపై హై పవర్ కమిటీ ఏర్పాటు*
*- విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
Ap News: పది, ఇంటర్ పరీక్షలు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
‘‘జులై 31 లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం.’’ అని మంత్రి వెల్లడించారు.
0 comments:
Post a Comment