వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయO
23.14 లక్షల మందికి 4,339 కోట్ల సాయం విడుదల
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని మంగళవారం విడుదల చేయనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి 23,14,342 మంది ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేస్తారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తుంది.
నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని లబ్ధిదారులు జీవనోపాధి పెంచుకునేందుకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.19 వేల కోట్ల సాయం అందించనున్నట్లు వివరించింది.
సాయం, శిక్షణకు కమాండ్ కంట్రోల్ కేంద్రం
చేయూత పథకం ద్వారా ఇప్పటికే 78 వేల మంది మహిళలు కిరాణా దుకాణాలు, 1,90,517 మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం ద్వారా కుటుంబ ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుల్ని కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసేందుకు వైఎస్సార్ చేయూత కాల్ సెంటర్ (0866-2468899, 93929 17899) ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అవసరమైన సాయం, శిక్షణ అందించేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించింది. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసిన మహిళలకు మార్కెట్ ధర కంటే తక్కువకే సరకులు, పాడి గేదెలు, ఆవుల కొనుగోలుకు సాయంతో పాటు అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా లీటరు పాలపై రూ.5 నుంచి రూ.15 వరకూ అదనపు ఆదాయం వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.
మా అమ్మగారికి last year44 age ఇప్పడు45 వచ్చాయి అయిన సరే చేయూత పథకం list లో పేరు లేదు...
ReplyDelete