*🌺Phone pay : ఫోన్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్...సరి కొత్తగా 'ఆటో టాప్ అప్' ఫీచర్... ఇలా ఉపయోగించండి
*🌺ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ గూగుల్‌పేకు గట్టిపోటీనిస్తోంది.*
*🌺తాజాగా, ఫోన్‌పే 'వాలెట్ ఆటో టాప్అప్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.*
*🌺 యూపిఐ విధానాన్ని అనుసరించి ఈ కొత్త ఫీచర్‌ను రోలవుట్ చేస్తోంది.*
*🌺ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ ఫోన్‌పే వాలెట్‌ను సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.*
*🌺ఫోన్‌పే వాలెట్లో అమౌంట్ లేనట్లైతే.. ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ లోడ్ అవుతుంది.*
*🌺తద్వారా, ఫోన్‌పే కస్టమర్లు ప్రతిసారీ వారి వాలెట్‌ను మాన్యువల్‌గా లోడ్ చేసే ఇబ్బందులు తీరనున్నాయి.*
*🌺ఈ ఆటో టాప్-అప్ ఆప్షన్ కస్టమర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. సుదీర్ఘమైన ప్రాసెల్ లేకుండా సింపుల్‌గా వాలెట్ లోడ్ చేస్తుంది*
*🌺అంతేకాదు, ఇది హై ట్రాన్సాక్షన్ సక్సెస్ రేటు (99.99 శాతం) కలిగి ఉంటుంది. కాగా, యూపిఐ ఈ-మ్యాన్‌డేట్ సెటప్ చేసిన తర్వాత, కస్టమర్లు తమ వాలెట్‌ను లోడ్ చేయాలనుకున్న లేదా చెల్లింపులు చేయాలనుకున్న ప్రతిసారీ యూపిఐ పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు.*
*🌺ఓటిపి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.*
*🌺 వాలెట్ బ్యాలెన్స్ జీరోకు పడిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా రీఛార్జ్ చేస్తుంది.*
*🌺ఈ-మ్యాన్‌డేట్ యూపిఐ ఫీచర్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌లో చాలా పెద్ద ముందడుగు అని ఫోన్‌పే పేర్కొంది. ఇది డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను మరింతగా ప్రోత్సహిస్తుందని, డిజిటల్ పేమెంట్ వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోగలదని తెలిపింది. అంతేకాదు, ఈ ఆటోపేమెంట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, మిగతా మాన్యువల్ పేమెంట్లతో పోలిస్తే ఇవి 99.99 శాతం సక్సెస్ రేటు కలిగి ఉంటాయని తెలిపింది. ఈ ఫీచర్‌ను రోలవుట్ చేయడం కూడా చాలా సులభం. ముందుగా మీ ఫోన్‌పే యాప్ హోమ్‌పేజీలోని వాలెట్ సెక్షన్లోకి వెళ్లండి.*
*🌺దానిలో 'టాప్-అప్' ఐకాన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు, మీరు వాలెట్‌కు జోడించాల్సిన మొత్తం ఎంటర్ చేసి టాప్‌టాప్ ప్రారంభించండి. ఉదాహరణకు మీ ఆటో టాప్-అప్ వాలెట్లో రూ .1,000 నుండి 5,000 రూపాయల వరకు లోడ్ చేయాలనుకుంటే.. మీ అమౌంట్‌ను ఎంటర్ చేసి 'టాప్-' పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ కింద ఉండే ఆటో టాప్-అప్ వాలెట్ ఆప్షన్‌ను అప్ & సెట్ చేయాలి. యుపిఐ పిన్ ఎంటర్ చేసి.. మీ బ్యాంక్ అకౌంట్‌ను ధృవీకరించాలి.ఆ తరువాత, మీ ఫోన్‌పే వాలెట్ వెంటనే రీఛార్జ్ అవుతుంది. ఈ అమౌంట్‌ను మీ మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్, డిష్ రీచార్జ్, ఇన్సూరెన్స్ రెన్యువల్ వంటి ఇతర చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.*
0 comments:
Post a Comment