SBI New Rules: భారతదేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ ఎప్పటికప్పుడు తన ఖాతాదారుల అవసరాలను గుర్తించి సరికొత్త విధానాలను తీసుకొస్తుంది.. తాజాగా ఎస్బిఐ తన ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.. క్యాష్ విత్డ్ డ్రా కు సంబంధించిన పలు కొత్త రూల్స్ ను అమలులోకి తీసుకువచ్చింది..
ఎస్బిఐ ప్రతిరోజు క్యాష్ విత్ డ్రా చేసే పరిమితిని పెంచింది. హోమ్ బ్రాంచ్ లో కాకుండా మిగతా శాఖ ఖాతాదారులు విత్ డ్రా ఫారం సహాయంతో తమ సేవింగ్స్ అకౌంట్ నుంచి 25 వేల వరకు నగదు డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అలాగే చెక్ ద్వారా అయితే మరో బ్రాంచ్ నుంచి లక్ష వరకు తీసుకోవచ్చని ప్రకటించింది.
అంతేకాకుండా థర్డ్ పార్టీ నగదు డ్రా పరిమితిని కూడా 50 వేల వరకు పెంచింది. కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ తక్షణమే అమలులోకి తీసుకు వచ్చినట్లు ఎస్బిఐ తెలిపింది. ఈ సరికొత్త రూల్స్ 30 సెప్టెంబర్ 2021 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.
థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవడం కుదరదని, థర్డ్ పార్టీ కేవైసి డాక్యుమెంట్ తప్పనిసరని ఎస్బిఐ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది.
0 comments:
Post a Comment