ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 16 నుంచి పాఠశాలలను పున: ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అదే రోజున మొదటి విడత ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితమిచ్చి.. రెండో విడత పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
అటు నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరించడమే కాకుండా.. విద్యార్ధులకు విద్యాకానుక కిట్‌లను సైతం అదేరోజున పంపిణీ చేయాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
*ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
: ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.
★తొలి విడత నాడు - నేడు పనులను అదేరోజు ప్రజలకు
అంకితం..
★విద్యారంగంలో రెండో విడత నాడు - నేడు పనులకు శ్రీకారం
★విద్యాకానుక కిట్లు కూడా అందజేయనున్న ప్రభుత్వం
★నూతన విద్యావిధానంపై సమగ్రంగా వివరించనున్న
ప్రభుత్వం..
★విద్యాశాఖలో నాడు - నేడు పై సమీక్షలో సీఎం జగన్
నిర్ణయం..
0 comments:
Post a Comment