దేశంలో మొదటి స్మార్ట్ కరెంటు స్తంభం... ధర రూ.2 కోట్లు...
దేశంలో కాస్త బాగానే డెవలప్ అయిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. అదేంటోగానీ... ఆ రాష్ట్రంలో రాజధాని గాంధీనగర్ గానీ... అహ్మదాబాద్ గానీ... అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఐతే... ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఢిల్లీలో పగ్గాలు చేపట్టాక... గుజరాత్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు.
టెక్నాలజీని ఉపయోగిస్తూ... అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు వేయిస్తున్నారు. రాష్ట్ర పాలకులు కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తూ... అటు వ్యవసాయంలో ఇటు ఇతర రంగాల్లో టెక్నాలజీని వాడేస్తున్నారు. మొన్ననే... గాంధీనగర్ రైల్వే స్టేషన్‌పై ఉన్న 5 స్టార్ హోటల్‌ని ప్రారంభించిన మోదీ... ఆ సందర్భంగా... ఈ రైల్వేస్టేషన్ ఇండియాలోది అంటే నమ్మగలరా అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా అహ్మదాబాద్‌లోని ఓ స్తంభం అందర్నీ ఆకట్టుకుంటోంది. అది మామూలు స్తంభం కాదు. స్మార్ట్ పవర్ పోల్. దేశంలోనే మొదటిది. స్మార్ట్ సిటీగా మారాలనుకుంటున్న అహ్మదాబాద్... ఓ అడుగు ముందుకేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్... స్మార్ట్ పవర్ పోల్స్ ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్... ప్రపంచ వారసత్వ నగరంగా మారింది. అక్కడి సీజీ రోడ్డులో ఈ స్తంభం ఆకట్టుకుంటోంది. ఇలాంటివి మొత్తం 19 స్తంభాలు ఏర్పాటుచేశారు. దేశంలో మరెక్కడా ఇలాంటివి లేవు.
చైనాలో తయారైన ఈ స్తంభం రేటు ఒక్కొక్కటి రూ.2 కోట్లు. వీటి కోసం రూ.38 కోట్లు ఖర్చయ్యాయి. ఈ స్తంభాలకు సీసీటీవీలు ఉంటాయి, ఎనౌన్స్‌మెంట్, డిస్‌ప్లే ఇలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి.
Chinese Smart Pole ఫీచర్లు: వీటిలో 2 రకాలున్నాయి. 1. ఒక మీటర్ స్మార్ట్ పోల్. 2.పది మీటర్ల స్మార్ట్ పోల్.
- వైఫై రూటర్
- 30 W LED ఫిక్చర్స్
- PTZ కెమెరా
- 30 W PA స్పీకర్
- USB చార్జింగ్ సాకెట్
- ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్
- వాతావరణ కేంద్రం
- బిల్ బోర్డు డిస్‌ప్లే
- ఎమర్జెన్సీ పుష్ బటన్
- వైఫై రూటర్
- 20 W స్పాట్ లైట్
- PTZ కెమెరా
- 30 W PA స్పీకర్
- వాతావరణ కేంద్రం
- బిల్ బోర్డు డిస్‌ప్లే
దేశంలో మొదటి స్మార్ట్ కరెంటు స్తంభం... ధర రూ.2 కోట్లు...
ప్రస్తుతానికి ఈ స్తంభాలను వాడేందుకు వీలు లేదు. ఎందుకంటే... వీటిలో సేవ్ అయ్యే డిజిటల్ డేటా... చైనా కంపెనీల సర్వర్లలో స్టోర్ అవుతుంది. అలా కాకుండా... అహ్మదాబాద్ సర్వర్లలో స్టోర్ అయ్యేలా మార్పులు చేయబోతున్నారు. ఆ పని అయిపోయాక... అప్పుడు వీటిని వాడుకలోకి తేనున్నారు.
మొత్తానికి ఈ కొత్త స్తంభాలు స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నాయి. వీటితో కలిగే ప్రయోజనాలేంటో ప్రజలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
0 comments:
Post a Comment